తమిళసినిమా: సామి చిత్రంలో విక్రమ్ పోషించిన ఆరుసామి పాత్రను ఆయన అభిమానులు అంత సులభంగా మర్చిపోలేరు.అంతే కాదు నటుడు విక్రమ్‌ను పక్కా మాస్ హీరో గా నిలబెట్టిన చిత్రం సామి. 2003లో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. అందులో పోలీస్‌అధికారిగా విక్రమ్ అవినీతిపరులు, అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారనే చెప్పాలి. హరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆ తరువాత తెలుగులోనూ రీమేక్ అయ్యి పెద్ద విజయాన్ని సాధించింది. 14 ఏళ్ల తరువాత సామి చిత్ర సీక్వెల్ శ్రీకారం చు ట్టారు. విక్రమ్ హీరోగా నటిస్తున్న ఇందులో సామి చిత్ర నాయకి త్రిష ఒక నాయకి, కీర్తీసురేశ్ మరో నాయకిగా నటిస్తున్నారు.
ఇతర ముఖ్య పాత్రల్లో బాబీసింహా, ప్రభు, వివేక్, సూరి నటిస్తున్నారు. హరి దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ యాక్షన్ కథా చిత్రాన్ని తమీన్ ఫిలింస్ ఇంతకు ముందు ఇరుముగన్ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన శిబు తమీన్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. దేవీశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న సామి–2 చిత్రం విజయదశమి సందర్భంగా శనివారం పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. విక్రమ్, కీర్తీసురేశ్, దేవీశ్రీప్రసాద్, దర్శకుడు హరి, చిత్ర నిర్మాత శిబు తమీన్ పాల్గొన్నారు. చిత్ర దర్శకుడు చిత్ర తొలి భాగాన్ని తిరునెల్వేలి పరిసర ప్రాంతాల్లో, రెండోభాగాన్ని రాజస్థాన్, ఉత్తరాది రాష్ట్రాల్లోనూ చిత్రీకరించనున్నట్లు వెల్లడించారు.
ఆరుసామి రెండో వేట మొదలెట్టాడు
Published Mon, Oct 2 2017 2:04 AM | Last Updated on Fri, May 25 2018 5:52 PM
Advertisement
Advertisement