Kirthi Suresh
-
కొమరక్క రాక్స్.... నాని, కీర్తి సురేష్ కామెడీ పీక్స్
-
సక్కనమ్మ చిక్కింది!
ఏ రంగంలోనైనా ప్రతిభకే పట్టం కడతారు. ఇక సినిమా రంగం విషయానికి వస్తే ప్రతిభ, అదృష్టంతో పాటు అందం చాలా ముఖ్యం. ఒకప్పటి కంటే ఇప్పటి హీరోయిన్లు అందాలను కాపాడుకోవడానికి ఎక్కువగానే కసరత్తులు చేస్తుంటారు. నటి కీర్తీసురేశ్ కూడా ఇందుకు అతీతం కాదు. కీర్తీççసురేశ్‌కు అదృష్టం అనేది తన రెండవ చిత్రంతోనే వరించింది. ఇక నటన అంటారా, మహానటి చిత్రంలోనే తన ప్రతిభాపాఠవాలను చాటుకుంది. మరింకేంటి అంటారా? అంతా బాగానే ఉంది అయితే మధ్యలో ఈ చిన్నది కాస్త బరువెక్కింది. సామి స్క్వేర్ లాంటి చిత్రాలు చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది. పైగా ఆ సమయంలో కీర్తీసురేశ్ నటించిన సామీ స్క్వేర్, సండైకోళ–2 వంటి చిత్రాలు ఆమెను నిరాశ పరిచాయి. అదిగో అలాంటి సమయంలోనే అమ్మడికి బాలీవుడ్ నుంచి కాల్ వచ్చింది. ఇక బాలీవుడ్ సినీ వర్గాలు, అక్కడి సినీ ప్రియుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. వారికి హీరోయిన్లు బొద్దుగా ఉంటే నచ్చదు. కీర్తీసురేశ్ స్లిమ్‌గా మారాల్సిన పరిస్థితి. ఇక డైట్లు, ఎక్సర్సైజ్లు అంటూ కసరత్తులు చేయక తప్పలేదు. మొత్తం ఈ సక్కనమ్మ చిక్కి మరింత నాజూగ్గా తయారైంది. సర్కార్ చిత్రం తరువాత ఈ బ్యూటీని తెరపై చూడలేదు. అలాగని నటిగా కీర్తీసురేశ్ ఖాళీగా లేదు. తెలుగు, తమిళం, మలయాళం, ఇప్పుడు అదనంగా హిందీ అంటూ బహుభాషా నటిగా బిజీగా ఉంది. చాలా తక్కువ కాలంలోనే హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల నటిగా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం బోనీకపూర్ నిర్మిస్తున్న హిందీ చిత్రంలో అక్షయ్కుమా ర్కు జంటగా నటిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది రెండవ భాగంలో తెరపైకి రానుంది. తమిళంలో దర్శకుడు కార్తీక్‌సుబ్బరాజ్ నిర్మి స్తున్న పెన్గి్వన్ చిత్రాన్ని పూర్తి చేసింది. ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రం. ఇందులో కీర్తీసురేశ్ గర్భిణిగా నటించడం మరో విశేషం. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న పెన్గి్వన్ చిత్రాన్ని త్వరలోనే తెరపైకి తీసుకురావడానికి చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నారు. ఇక తెలుగులోనూ రెండు చిత్రాల్లో నటిస్తున్న కీర్తీసురేశ్ కోసం సూపర్‌స్టార్ చిత్రం ఎదురుచూస్తున్నట్లు ఇప్పటికే టాక్ స్ప్రెడ్ అయిన విషయం తెలిసిందే. ఇక మాతృభాష మలయాళంలో ఎలాగూ నటిస్తూనే ఉంది కీర్తి. -
పండగ పందెం
-
ఈ నటి చాలా లక్కీ అట..!
సాక్షి, చెన్నై: ముంబై ముద్దుగుమ్మ సాయేషా సైగల్ ఇళయదళపతి విజయ్‌తో జత కట్టనుంది. ఈ లక్కీ నటికి అతి తక్కువ సమయంలోనే విజయ్ సరసన నటించే అవకాశం వచ్చింది. విజయ్ తన 62వ చిత్రంలోనూ ఇద్దరు ముద్దుగుమ్మలట. తెరి సినిమాలో సమంత, ఎమీజాక్సన్లతో యువళగీతాలు పాడేశారు. మెర్శల్ చిత్రంలో ఏకంగా సమంత ,కాజల్‌అగర్వాల్, నిత్యామీనన్‌లతో డ్యూయెట్లు పాడేశారు. ప్రస్తుతం తన 62వ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కాంబినేషన్లో తుపాకీ, కత్తి చిత్రాలు తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇందులో విజయ్‌కు జంటగా నటి కీర్తిసురేశ్ ఎంపికయ్యారు. ఈ బ్యూటీతో సన్నివేశాల చిత్రీకరణ కూడా మొదలైంది. ఈ చిత్రంలో మరో హీరోయిన్ ఉంటుందన్న సమాచారాన్ని చిత్ర యూనిట్ ఆలస్యంగా వెల్లడించింది. వనమగన్ చిత్రంలో తన నటనలో చక్కని అభినయాన్ని ప్రదర్శించి, డాన్స్‌తో దుమ్మురేపిన ముంబై చిన్నది సాయేషా సైగల్. ఈ లక్కీ నటికి అతి తక్కువ సమయంలోనే విజయ్‌తో నటించే అవకాశం తలుపు తట్టింది. ఇప్పటికే కార్తీ, విజయ్‌సేతుపతిల సరసన నటిస్తూ బిజీగా ఉన్న సాయేషాకు విజయ్‌తో భారీ చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఈ బ్యూటీది చిత్రంలో చాలా ప్రాధ్యానత ఉన్న పాత్ర అని సమాచారం. ఈ చిత్రానికి ఏఆర్.రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. -
ఆరుసామి రెండో వేట మొదలెట్టాడు
తమిళసినిమా: సామి చిత్రంలో విక్రమ్ పోషించిన ఆరుసామి పాత్రను ఆయన అభిమానులు అంత సులభంగా మర్చిపోలేరు.అంతే కాదు నటుడు విక్రమ్‌ను పక్కా మాస్ హీరో గా నిలబెట్టిన చిత్రం సామి. 2003లో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. అందులో పోలీస్అధికారిగా విక్రమ్ అవినీతిపరులు, అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారనే చెప్పాలి. హరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆ తరువాత తెలుగులోనూ రీమేక్ అయ్యి పెద్ద విజయాన్ని సాధించింది. 14 ఏళ్ల తరువాత సామి చిత్ర సీక్వెల్ శ్రీకారం చు ట్టారు. విక్రమ్ హీరోగా నటిస్తున్న ఇందులో సామి చిత్ర నాయకి త్రిష ఒక నాయకి, కీర్తీసురేశ్ మరో నాయకిగా నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో బాబీసింహా, ప్రభు, వివేక్, సూరి నటిస్తున్నారు. హరి దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ యాక్షన్ కథా చిత్రాన్ని తమీన్ ఫిలింస్ ఇంతకు ముందు ఇరుముగన్ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన శిబు తమీన్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. దేవీశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న సామి–2 చిత్రం విజయదశమి సందర్భంగా శనివారం పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. విక్రమ్, కీర్తీసురేశ్, దేవీశ్రీప్రసాద్, దర్శకుడు హరి, చిత్ర నిర్మాత శిబు తమీన్ పాల్గొన్నారు. చిత్ర దర్శకుడు చిత్ర తొలి భాగాన్ని తిరునెల్వేలి పరిసర ప్రాంతాల్లో, రెండోభాగాన్ని రాజస్థాన్, ఉత్తరాది రాష్ట్రాల్లోనూ చిత్రీకరించనున్నట్లు వెల్లడించారు. -
అందరూ అభిమానించేలా..
అందాల అభినేత్రి సావిత్రి జీవిత కథతో ‘మహానటి’ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుండగా, మరో ప్రధాన పాత్రలో సమంత నటిస్తున్నారు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నిర్మాత అశ్వినీదత్ కుమార్తె స్వప్న దత్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇటీవల తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ హైదరాబాద్‌లోని గండిపేటలో గురువారం ప్రారంభమైంది. స్వప్నదత్ మాట్లాడుతూ– ‘‘సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నారు. తాజా షెడ్యూల్లో దుల్కర్ ఎంటరయ్యారు. ‘మహానటి’ సినిమా సావిత్రి అభిమానులకే కాక ప్రతి సినిమా అభిమానినీ అలరించేలా ఉంటుంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోన్న ఈ సినిమాకి మిక్కీ. జె మేయర్ సంగీతం అందిస్తున్నారు’’ అన్నారు. -
ఎవరైతే నాకేంటి!
నిర్ణయాలు అంద రూ తీసుకుంటారు.అయితే కొందరే వాటికి కట్టుబడి ఉంటారు. ముఖ్యంగా చిత్రపరిశ్రమలో నిర్ణయాలనేవి ఎక్కువగా నీటి మీద రాతల్లాంటివే అనవచ్చు. ఇక కథానాయికలైతే కథలు చాలానే వల్లివేస్తుంటారు.ఆచరణకు వచ్చేసరికే అవి గుర్తుకురావు. గ్లామరస్ పాత్రల్లో నటించే అవకాశం రానంత వరకు అలాంటి పాత్రలకు తాను దూరం అంటుంటారు. తీరా తన వరకూ వచ్చినప్పుడు కథ డిమాండ్, అందులో అసభ్యత ఏమీ కనిపించదు.దర్శకుడు చాలా కవితాత్మకంగా చిత్రీకరించారు లాంటి వ్యాఖ్యలతో కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంటారు. తాజాగా యువ నటి కీర్తిసురేష్ కూడా షరామామూలే అన్నట్లు నేను గ్లామర్‌కు దూరం అంటోంది. సీనియర్ నటి మేనక కూతురైన ఈ బ్యూటీ కోలీవుడ్లోకి విక్రమ్‌ప్రభుకు జంటగా ఇదు ఎన్న మాయం చిత్రం ద్వారా రంగప్రవేశం చేసింది.దానితో పాటు శివకార్తికేయన్ సరసన రజినీమురుగన్, బాబిసింహాతో పాంబుసండై చిత్రాల్లో వరుసగా నటిస్తోంది. వీటిలో ఏ ఒక్క చిత్రం ఇంకా తెరపైకి రాలేదు.అలాగే జీవాతో కవలైవేండాం అనే చిత్రంలోనూ కీర్తి నటిస్తోంది. తాజాగా నటుడు విశాల్‌కు జోడీగా నటిస్తానని చివరికి హ్యాండ్ ఇచ్చిందనే ప్రచారం కోలీవుడ్‌లో జరుగుతోంది. ఇక అసలు విషయానికొస్తే తాను గ్లామర్‌గా నటించేది లేదు.అది విజయ్ అయినా,అజిత్ అయినాగానీ ఇంకా ఎంతటివారైనా తన నిర్ణయంతో మార్పు ఉండదు అంటోంది కీర్తి. ఆమె ఏ మాత్రం తన మాట మీద నిలబడుతుందో చూద్దాం.