అందరూ అభిమానించేలా.. | The second schedule of 'Mahanati' was started on Thursday in Gandipet. | Sakshi
Sakshi News home page

అందరూ అభిమానించేలా..

Published Thu, Jun 22 2017 11:34 PM | Last Updated on Tue, Sep 5 2017 2:14 PM

అందరూ అభిమానించేలా..

అందరూ అభిమానించేలా..

అందాల అభినేత్రి సావిత్రి జీవిత కథతో ‘మహానటి’ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్‌ నటిస్తుండగా, మరో ప్రధాన పాత్రలో సమంత నటిస్తున్నారు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో నిర్మాత అశ్వినీదత్‌ కుమార్తె స్వప్న దత్‌   ఈ సినిమా నిర్మిస్తున్నారు.

ఇటీవల తొలి షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్‌ హైదరాబాద్‌లోని గండిపేటలో గురువారం ప్రారంభమైంది. స్వప్నదత్‌ మాట్లాడుతూ– ‘‘సావిత్రి భర్త జెమినీ గణేశన్‌ పాత్రలో మలయాళ సూపర్‌ స్టార్‌ హీరో దుల్కర్‌ సల్మాన్‌ నటిస్తున్నారు. తాజా షెడ్యూల్‌లో దుల్కర్‌ ఎంటరయ్యారు. ‘మహానటి’ సినిమా సావిత్రి అభిమానులకే కాక ప్రతి సినిమా అభిమానినీ అలరించేలా ఉంటుంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోన్న ఈ సినిమాకి  మిక్కీ. జె మేయర్‌ సంగీతం అందిస్తున్నారు’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement