ఎవరైతే నాకేంటి! | “No Glamour” Says Kirthi Suresh | Sakshi
Sakshi News home page

ఎవరైతే నాకేంటి!

Published Wed, Jul 1 2015 2:56 AM | Last Updated on Sun, Sep 3 2017 4:38 AM

ఎవరైతే నాకేంటి!

ఎవరైతే నాకేంటి!

నిర్ణయాలు అంద రూ తీసుకుంటారు.అయితే కొందరే వాటికి కట్టుబడి ఉంటారు. ముఖ్యంగా చిత్రపరిశ్రమలో నిర్ణయాలనేవి ఎక్కువగా నీటి మీద రాతల్లాంటివే అనవచ్చు. ఇక కథానాయికలైతే కథలు చాలానే వల్లివేస్తుంటారు.ఆచరణకు వచ్చేసరికే అవి గుర్తుకురావు. గ్లామరస్ పాత్రల్లో నటించే అవకాశం రానంత వరకు అలాంటి పాత్రలకు తాను దూరం అంటుంటారు. తీరా తన వరకూ వచ్చినప్పుడు కథ డిమాండ్, అందులో అసభ్యత ఏమీ కనిపించదు.దర్శకుడు చాలా కవితాత్మకంగా చిత్రీకరించారు లాంటి వ్యాఖ్యలతో కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంటారు. తాజాగా యువ నటి కీర్తిసురేష్ కూడా షరామామూలే అన్నట్లు నేను గ్లామర్‌కు దూరం అంటోంది.

 సీనియర్ నటి మేనక కూతురైన ఈ బ్యూటీ కోలీవుడ్‌లోకి విక్రమ్‌ప్రభుకు జంటగా ఇదు ఎన్న మాయం చిత్రం ద్వారా రంగప్రవేశం చేసింది.దానితో పాటు శివకార్తికేయన్ సరసన రజినీమురుగన్, బాబిసింహాతో పాంబుసండై చిత్రాల్లో వరుసగా నటిస్తోంది. వీటిలో ఏ ఒక్క చిత్రం ఇంకా తెరపైకి రాలేదు.అలాగే జీవాతో కవలైవేండాం అనే చిత్రంలోనూ కీర్తి నటిస్తోంది. తాజాగా నటుడు విశాల్‌కు జోడీగా నటిస్తానని చివరికి హ్యాండ్ ఇచ్చిందనే ప్రచారం కోలీవుడ్‌లో జరుగుతోంది. ఇక అసలు విషయానికొస్తే తాను గ్లామర్‌గా నటించేది లేదు.అది విజయ్ అయినా,అజిత్ అయినాగానీ ఇంకా ఎంతటివారైనా తన నిర్ణయంతో మార్పు ఉండదు అంటోంది కీర్తి. ఆమె ఏ మాత్రం తన మాట మీద నిలబడుతుందో చూద్దాం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement