- కర్నూల్ డీఎస్పీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
- ఏపీ డీజీపీకి లేఖ రాయనున్న సీఐడీ అదనపు డీజీపీ
సాక్షి, హైదరాబాద్: ఆయన అవినీతి రాష్ట్రాలు దాటింది. తెలంగాణలో స్కాం విచారణ జరుగుతూ ఉంటే, ఆ కుంభకోణంలో నిందితులకు, దర్యాప్తు అధికారికి మధ్య బేరసారాలు సాగించడంలో కీలక పాత్ర పోషించారు. బోధన్ కమర్షియల్ స్కాంలో సస్పెండ్ అయిన డీఎస్పీ విజయ్‌కుమార్ వ్యవహారంలో కర్నూలు డీఎస్పీ పాత్రపై పూర్తి ఆధారాలు బయటపడ్డాయి. రూ.65 లక్షలు డీల్ సెట్ చేసిన డీఎస్పీ కర్నూల్‌లోని ఓ విభాగంలో పని చేస్తున్నట్టుగా గుర్తించారు. ఈ మేరకు బోధన్ స్కాంలో ఏ2గా ఉన్న సునీల్, అతడి అసిస్టెంట్ రామలింగంతో ఆయన సంప్రదింపులు సాగించినట్టు తేల్చారు.
సునీల్, రామలింగంలను విచారించగా.. విజయ్‌కుమార్, కర్నూల్ డీఎస్పీల వ్యవహారంపై వాంగ్మూలం ఇచ్చినట్టు సీఐడీ ఉన్నతాధికారులు ‘సాక్షి’కి స్పష్టంచేశారు. దీంతో ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావుకు సమాచారం అందించి.. చర్యలకు ఆదేశించేలా సీఐడీ అదనపు డీజీపీ లేఖ రాయనున్నట్టు ఉన్నతాధికారులు స్పష్టంచేశారు. 1989 బ్యాచ్‌లో విజయ్‌కుమార్, కర్నూల్ డీఎస్పీ ఎస్‌ఐలుగా నియామకం అయ్యారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య పరిచయాలున్నాయి. అయితే కేసు దర్యాప్తును క్యాష్ చేసుకునేందుకు కర్నూల్ డీఎస్పీని విజయ్‌కుమార్ వాడుకున్నారా? లేక బోధన్ నిందితుల తరఫు వకాల్తా తీసుకొని కర్నూలు డీఎస్పీ స్కాం సెట్ చేసే ప్రయత్నం చేశారా అన్నది తేల్చాల్సి ఉందని సీఐడీ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
బోధన్ స్కామ్.. కర్నూల్ డీఎస్పీ డీల్
Published Thu, Apr 27 2017 2:10 AM | Last Updated on Wed, Apr 3 2019 5:38 PM
Advertisement