
అత్యాచారం కేసులో అటవీ సిబ్బంది అరెస్ట్
తాడ్వాయి: గొత్తికోయ గూడెం కు చెందిన గొత్తి కోయ గిరిజన యువతిపై అత్యాచారానికి పాల్పడ్డ అటవీ సిబ్బంది విజయ్ కుమార్, సంతోష్‌లను తాడ్వాయి పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు ములుగు డీఎస్పీ దక్షిణామూర్తి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అడవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవనం సాగించే ఈ గొత్తికోయ మహిళలు రోజుమాదిరి అడవిలోకి ఎర్ర చీమల కోసం వెళ్లారు.
వీరిలో ఒకరిపై బేస్ క్యాంపు సిబ్బంది విజయ్ కుమార్, సంతోష్‌లు అత్యాచారానికి ఒడిగట్టారు. తాడ్వాయి పోలీసులు నిందితులిద్దరిని అరెస్టు చేసి విచారణ చేపట్టగా, నేరం ఒప్పుకున్నారని ఆయన తెలిపారు. నిందితులపై ఐపీసీ 366, 376 సెక్షన్లపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు.