కంబదూరు: మండల కేంద్రం కంబదూరులో కన్న కూతురిపై తండ్రి అత్యాచారానికి పాల్పడిన ఘటనపై కళ్యాణదుర్గం డీఎస్పీ వెంకటరమణ మంగళవారం విచారణ చేపట్టారు. సంఘటన స్థలానికి వెళ్లి అక్కడ ఉన్న రక్తపు మరకలను పరిశీలించి స్థానికులతో మాట్లాడారు. బాలిక చదువుతున్న కేజీబీవీకి కూడా వెళ్లి అక్కడి సిబ్బందితో కొన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. డీఎస్పీ వెంట ఎస్‌ఐ నరసింహుడు, సిబ్బంది ఉన్నారు.