
సాక్షి, కొత్తగూడెం: కరోనా నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్న తరుణంలో బాధ్యతగా ఉండాల్సిన ఓ పోలీసు అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. విదేశాల నుంచి వచ్చిన తన కుమారుడిని కొత్తగూడెం డీఎస్పీ క్వారైంటన్‌లో పెట్టకుండా తీసుకెళ్లాడు. దీంతో అతనిపై 1897 అంటువ్యాధుల నిర్మూలన చట్టం కింద కేసు నమోదైంది. అయితే, లండన్ నుంచి వచ్చిన డీఎస్పీ కుమారుడికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. దీంతో కొత్తగూడెం పోలీసు యంత్రాంగంలో కలవరం మొదలైంది. డీఎస్పీతో సహా అతని కుంటుంబాన్ని వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు వరంగల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, డీఎస్పీ కుంటుంబం ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం రాఘవాపురంలో ఓ గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నట్టు తెలిసింది.
(చదవండి: బయటకు వచ్చే సాహసం చెయ్యొద్దు: సీపీ సజ్జనార్)
సర్కార్ కొరడా..
క్వారంటైన్‌లో ఉండకుండా తప్పించుకు తిరుగుతున్నవారిపై రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝళిపించింది. నిబంధనలు ఉల్లఘించిన 60 మందిపై 1897 ఎపిడెమిక్ డిజీజ్ యాక్ట్ కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. మరింత కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం పోలీసులకు ఆదేశాలిచ్చింది. చట్టాన్ని ఉల్లంఘించి ఇళ్లనుంని బయటికి వచ్చే వారిని ఉపేక్షించొద్దని స్పష్టం చేసింది.
(చదవండి: తెలంగాణలో ఒక్కరోజే 6 పాజిటివ్ కేసులు: ఈటల)
Comments
Please login to add a commentAdd a comment