
మాట్లాడుతున్న డీఎస్పీ రవి మనోహరాచారి
చిత్తూరు, మదనపల్లె: కురబలకోట మండలం అంగళ్లు సమీపంలోని చేనేతనగర్ కల్యాణ మండపంలో ఇటీవల జరిగిన చిన్నారి వర్షిత హత్యాచారం కేసును రీకన్‌స్ట్రక్షన్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు డీఎస్పీ రవిమనో హరాచారి తెలిపారు. సోమవారం ఆయన వర్షిత పోస్టుమార్టం విషయమై స్థానిక జిల్లా ఆస్పత్రిలో వైద్యులతో చర్చించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ.. హత్యాచారం కేసులో నిందితుడిపై ఆధారాలు బలంగా ఉన్నాయన్నారు. నిందితునికి కఠిన శిక్ష తప్పదన్నారు. ఇప్పటికే ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్టు, పోర్టుమార్టం నివేదికలు రావడంతో కేసుకు మరింత బలం చేకూరిందన్నారు. కేసును ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా త్వరితగతిన తీర్పు వచ్చేలా చూస్తామన్నారు. డీఎస్పీ వెంట మదనపల్లె రూరల్ సీఐ అశోక్‌కుమార్ తదితరులు ఉన్నారు.
చదవండి: వర్షిత కేసు; ‘నిందితుడిని ఉరి తీయాలి’
చదవండి: వర్షిత హంతకుడు ఇతడే!
Comments
Please login to add a commentAdd a comment