డీఎస్పీ దాసరి రవిబాబు, శ్రీనివాసరాజు (ఫైల్)
గాజువాక: విశాఖలో రౌడీషీటర్ కె.సత్యనారాయణరాజు అలియాస్ గేదెలరాజు హత్య కేసులో ప్రధాన ముద్దాయిలుగా ఉన్న డీఎస్పీ దాసరి రవిబాబు, క్షత్రియభేరి ఎడిటర్, మేనేజింగ్ డైరెక్టర్ భూపతిరాజు శ్రీనివాసరాజు హైదరాబాద్‌లో తిష్ట వేసినట్లు తెలిసింది. ముందస్తు బెయిల్ తెచ్చుకోవడానికి వీరు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఈనెల 6న చోటు చేసుకున్న గేదెలరాజు హత్య కేసులో దర్యాప్తును దాదాపు పూర్తిచేసిన పోలీసు బృందాలు మొత్తం 12 మందిని నిందితులుగా నిర్ధారించడం తెలిసిందే. హత్య జరిగి పదిరోజులైనా ప్రధాన నిందితులైన రవిబాబు, భూపతిరాజు వివరాలు తెలియరాలేదు.
తన ప్రియురాలు పద్మలత హత్యకు సంబంధించిన కిరాయి విషయంలో వివాదాలు తలెత్తడంతో గేదెలరాజును డీఎస్పీయే హత్య చేయించినట్టుగా తమ విచారణలో వెల్లడైందని పోలీసులు తెలపడం విదితమే. క్షత్రియభేరి పత్రికా కార్యాలయంలో ఈ హత్య జరిగినట్టు పోలీసులు అనుమానించడంతో రవిబాబు, భూపతిరాజు ఒకేసారి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. హైదరాబాద్‌లో ఉన్నట్టు పోలీసువర్గాల సమాచారం. తమను అరెస్టు చేయకుండా హైకోర్టులో ముందస్తు బెయిల్ తెచ్చుకోవడానికి అక్కడే తిష్టవేసి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment