11 మంది డీఎస్పీలకు పోస్టింగులు | transfers and postings of dsps in andrapradesh | Sakshi
Sakshi News home page

11 మంది డీఎస్పీలకు పోస్టింగులు

Published Wed, Jul 12 2017 11:17 AM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM

transfers and postings of dsps in andrapradesh

అమరావతి:  ఏపీలో కొన్ని నెలలుగా పోస్టింగ్‌ల కోసం ఎదురుచూస్తోన్న డీఎస్పీలకు ఎట్టకేలకు లైన్‌క్లియర్‌ అయింది. వెయిటింగ్‌లో ఉన్న11 మంది డీఎస్పీలకు పోస్టింగ్‌లు ఇస్తూ డీజీపీ సాంబశివరావు ఉత్తర్వులు జారీచేశారు. అదేవిధంగా ఒక డీఎస్పీని బదిలీ చేశారు. పోస్టింగులు ఇచ్చిన అధికారులను తక్షణమే విధుల్లో చేరాల్సిందిగా డీజీపీ ఆదేశించారు.
 
పోస్టింగ్‌ ఇచ్చిన డీఎస్పీలు ఎమ్‌. మహబూబ్‌ బాషా, వైవీ రమణ కుమార్‌, ఎమ్‌ . కృష్ణ మూర్తి నాయుడు, ఎ. దేవదానం, కె. తిరుమల రావు, జి. సోమేశ్వర రావు, జి. ఆంజనేయులు, సీహెచ్‌. పాపారావు, బి. మల్లేశ్వరరావు, టి. మధుసూదన్‌ చారి, పి. సోమశేఖర్‌ లకు కొత్తగా పోస్టింగులు ఇచ్చారు. శ్రీకాకుళంలో డీఎస్పీగా పనిచేస్తున్న టీ. మోహన్‌ రావును విజయవాడలోని పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌ కు బదిలీ చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement