DGP Sambashiva Rao
-
11 మంది డీఎస్పీలకు పోస్టింగులు
అమరావతి: ఏపీలో కొన్ని నెలలుగా పోస్టింగ్‌ల కోసం ఎదురుచూస్తోన్న డీఎస్పీలకు ఎట్టకేలకు లైన్‌క్లియర్ అయింది. వెయిటింగ్లో ఉన్న11 మంది డీఎస్పీలకు పోస్టింగ్‌లు ఇస్తూ డీజీపీ సాంబశివరావు ఉత్తర్వులు జారీచేశారు. అదేవిధంగా ఒక డీఎస్పీని బదిలీ చేశారు. పోస్టింగులు ఇచ్చిన అధికారులను తక్షణమే విధుల్లో చేరాల్సిందిగా డీజీపీ ఆదేశించారు. పోస్టింగ్ ఇచ్చిన డీఎస్పీలు ఎమ్. మహబూబ్ బాషా, వైవీ రమణ కుమార్, ఎమ్ . కృష్ణ మూర్తి నాయుడు, ఎ. దేవదానం, కె. తిరుమల రావు, జి. సోమేశ్వర రావు, జి. ఆంజనేయులు, సీహెచ్. పాపారావు, బి. మల్లేశ్వరరావు, టి. మధుసూదన్ చారి, పి. సోమశేఖర్ లకు కొత్తగా పోస్టింగులు ఇచ్చారు. శ్రీకాకుళంలో డీఎస్పీగా పనిచేస్తున్న టీ. మోహన్ రావును విజయవాడలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
ఏపీలో పెద్ద ఎత్తున డీఎస్పీల బదిలీలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున్న డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఈ మేరకు డీజీపీ సాంబశివరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వెయిటింగ్ లో ఉన్న ఒక డీఎస్పీతో సహా మొత్తం 17 మంది డీఎస్పీలకు స్థాన చలనం కలిగించారు. బదిలీ అయిన డీఎస్పీలు ఎస్.వి.శ్రీధర్ రావు, ఎన్ సుబ్బారావు, వి రామరావు, ఎ.వి.ఎల్ ప్రసన్నకుమార్, కే. శ్రీనివాసులు, పి. మహేశ్, ఎస్.వి.గోపాల్ కృష్ణ, కే.వి.రాఘవ రెడ్డి, ఎన్. వెంకట రామంజనేయులు, ఏ. శ్రీనివాస్ రావు, ఎమ్. మునిరామయ్య, ఎల్. అర్జున్, కె. వెంకటరమణ, ఎస్. వెంకటేశ్వరరావు, సిహెచ్. మురళీకృష్ణలతో పాటు వెయిటింగ్ లో ఉన్న కరీముల్ల శరీఫ్ లు ఉన్నారు. వీరంతా వారికి కేటాయించని ప్రాంతాల్లో వెంటనే రిపోర్టు చేసి చార్జ్ తీసుకోవాలని డీజీపీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.