సాక్షి, హైదరాబాద్: పోలీసు శాఖలో పోస్టింగుల వ్యవహారం వివాదం రేపుతోంది. పలు జిల్లాల్లో డీఎస్పీల నియామకంపై పలువురు మంత్రులు మండిపడుతున్నట్లు తెలుస్తోంది. తమకు తెలియకుండా తమ ప్రాంతాల్లో డీఎస్పీలకు పోస్టింగులు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. దీనిపై నేరుగా పోలీసు ఉన్నతాధికారులకే ఫిర్యా దులు, సిఫార్సులు చేస్తున్నట్లు తెలిసింది.
చందూలాల్ లేఖతో..
ఇటీవలి డీఎస్పీల బదిలీలు రాజకీయ నేతల సిఫార్సులతోనే జరిగాయన్న ప్రచారముంది. అయితే భూపాలపల్లి జిల్లా ములుగు డీఎస్పీ పోస్టింగ్‌పై మంత్రి చందూలాల్ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు మంత్రి రాసిన సిఫార్సు లేఖ సంచలనంగా మారుతోంది. తన నియోజకవర్గ ప్రధాన కేంద్రం (హెడ్ క్వార్టర్స్) ములు గు డీఎస్పీగా రాఘవేందర్‌రెడ్డిని నియమి స్తూ డీజీపీ అనురాగ్‌శర్మ ఈ నెల 4న ఉత్తర్వు లు జారీచేశారు.
అయితే ములుగు డీఎస్పీగా ఇద్దరి పేర్లను సూచిస్తూ వారిలో ఒకరిని నియమించాలంటూ గురువారం మంత్రి చందూలాల్ తన లెటర్‌హెడ్‌పై సిఫార్సు చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్‌లో పనిచేస్తున్న ఎన్.సుభాష్‌బాబు, వరంగల్ కమిషనరేట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో ఏసీపీగా ఉన్న జి.మదన్‌లాల్‌లలో ఒకరిని నియమించాలని కోరారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు ఇరకాటం లో పడ్డారు.
ఇంటెలిజెన్స్ అధికారులు పూర్తిస్థాయిలో డీఎస్పీల పోస్టింగ్స్‌పై కసరత్తు చేసిన తర్వాతే డీజీపీ అనురాగ్‌శర్మ ఉత్తర్వులు వెలువరించారు. కానీ ఇప్పుడు మంత్రి వేరే వారిని నియమించాలంటూ కోరడం వెనుక ఆంతర్యమేమిటన్న దానిపై ఇంటెలిజెన్స్ ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.
మరో ఇద్దరు మంత్రులు సైతం!
ఉత్తర తెలంగాణకు చెందిన ఓ కీలక మంత్రి తన అనుమతి లేకుండా పాత జిల్లాల్లో ఇద్దరు డీఎస్పీలకు కీలకమైన పోస్టింగ్ ఇచ్చారని ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలు స్తోంది. పాత జిల్లా నుంచి కొత్తగా ఏర్పాటైన జిల్లాకు సైతం తానే పెద్ద అని, అలాంటిది తనకు చెప్పకుండా ఇద్దరిని ఎలా నియమిస్తార ని పేర్కొన్నట్లు సమాచారం. ఇక దక్షిణ తెలం గాణలో మరో మంత్రి సైతం ఇదే రీతిలో అ భ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
కొత్తగా ఏర్పడ్డ ఓ సబ్ డివిజన్‌కు డీఎస్పీగా నియ మించిన అధికారిని వెంటనే మార్చాలని ఒత్తిడి తీసుకువస్తున్నట్టు పేర్కొంటున్నాయి. ఎన్నికలకు ముందు సమయంలో తమకు పరిచ యం లేని అధికారులను, పైగా తమ మనుషులు కాని వారికి ఎలా పోస్టింగ్ ఇస్తారని పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. దీనిపై సీఎం వద్దే తేల్చుకుంటామని ఓ మంత్రి హెచ్చరించినట్లు ఐపీఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment