
హత్య కేసులో తొమ్మిది మంది అరెస్ట్
సూర్యాపేటరూరల్: హత్య కేసులో తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్టు సూర్యాపేట డీఎస్పీ సునితామోహన్ తెలిపారు. శనివారం సూర్యాపేట సర్కిల్ పోలీస్‌స్టేషన్‌లో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి కేసు వివరాలు వెల్లడించారు. ఆత్మకూర్ (ఎస్) మండలం పాతర్లపాడులో ఈ నెల 16న గంగదేవమ్మ పండుగను గ్రామస్తులంతా వైభవంగా జరుపుకుంటున్నారు. యాదవ కులస్తులు యాటలు బలిచ్చి ఆల య సమీ పంలోనే వంటలు చేసుకుని బంధుమిత్రులతో భోజ నాలు చేశారు. సాయంత్రం గంగదేవమ్మ ఆ లయం చుట్టూ యాదవ కులస్తులు బేరీలు కొడుతూ ప్రదిక్షణలు చేశారు.
ఈ క్రమంలో పాతర్లపహాడ్‌కు చెందిన బొల్లక బక్కయ్యకు కేశబోయిన అంజయ్యకు వా గ్వాదం జరిగింది. ఒకరి కాలు ఒకరికి తగిలిందం టూ ఘర్షణకు దిగారు. వీరిద్దరూ గొడవ పడుతున్న సమయంలో అక్కడ ఉన్నవారు సర్ది చెప్పిపంపిం చారు. కాసేపటి తర్వాత బొల్లక బక్కయ్య, అతడి అ న్న లింగయ్య, తమ్ముడు చిన్న లింగయ్య, బావమరిది ఉప్పుల పుట్టయ్య, కుమారుడు గణేష్, భార్య లిం గమ్మ, అక్కబయ్య లింగమ్మ, బంధువులైన బొల్లక దేవలింగం, బొల్లక మల్లయ్యలు గడగొయ్యలను తీసుకుని తంగెళ్ల దామోదర్‌రెడ్డి వ్యవసాయ బావి వద్ద పం డుగ చేసుకుంటున్న కేశబోయిన అంజయ్యపై దాడి చేశారు. అడ్డువచ్చిన అంజయ్య తండ్రి సౌడ య్య, కొడుకు ర మేష్‌ను, మరదలు నాగలక్ష్మమ్మపై కూడా దాడి చేశారు. గాయపడిన సౌడయ్యను హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో అదేరోజు మృతి చెందాడు.
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీ సులు దర్యాప్తు ముమ్మరం చేశా రు. శనివారం ఆత్మకూర్ ఎస్ మండలం పాతర్లపహాడ్ స్టేజీ వద్ద నిందితులు ఉన్నట్లు సమాచారం రాగా సూర్యాపేట రూరల్ సీఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ వివరించారు. తొమ్మిది మంది నేరస్తుల్లో బొల్లక గణేష్ మైనర్ కావడంతో అతడిని నల్లగొండ జూవైనల్ కోర్టులో హాజరుపరుచనున్నట్లు, మిగతావారిని సూర్యాపేట కోర్టులో రిమాండ్‌కు పంపించనున్నట్లు తెలిపా రు. సమావేశంలో సూర్యాపేటరూరల్ సీఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎస్ ఎస్‌ఐ హరికృష్ణ పాల్గొన్నారు.