
ఇబ్రహీంపట్నం: జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు దరఖాస్తులను కిటికిలో నుంచే తీసుకుంటున్నారు. వివిధ పనులపై కార్యాలయానికి వచ్చిన వారిని లోపలికి అనుమతించడం లేదు. తహసీల్దార్ విజయారెడ్డి హత్య అనంతరం కార్యాలయం సిబ్బంది భయభ్రాంతులకు గురవుతున్నారు.
వారం తర్వాత విధుల్లోకి చేరిన రెవెన్యూ సిబ్బంది ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఒకవేళ బాధితులను లోపలికి పిలిస్తే గేటు వద్ద వారిని వీఆర్‌ఏలు తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment