గ్రూప్ 2 రాసిన తండ్రీ కొడుకులు
ఇబ్రహీంపట్నం : కరీంనగర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం, గోధూర్ గ్రామానికి చెందిన గురుడు అశోక్, కొడుకు విశాల్ గ్రూప్ 2 పరీక్షకు హాజరయ్యారు. తండ్రి కొడుకులు ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. తండ్రి అశోక్ గోధూర్ ప్రాథమిక పాఠశాలలో హెచ్‌ఎంగా, విశాల్ ఎర్దండి ప్రభుత్వ పాఠశాలలో సెంకడరీ గ్రేడ్ టీచర్‌గా పని చేస్తున్నారు. గ్రూప్–2 ఉద్యోగానికి ఓపెన్ కేటగిరిలో అభ్యర్థులకు 44 ఏళ్ల వరకు అవకాశం ఇవ్వగా బీసీలకు ఐదేళ్ల సడలింపు ఇవ్వడంతో 49 ఏళ్ల వయస్సులో 2015లో అశోక్ దరఖాస్తులు చేసుకున్నారు. అశోక్‌కు ఆర్మూర్‌లోని నరేంద్ర డిగ్రీ కళాశాలలో, విశాల్‌కు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కేర్ డిగ్రీ కళాశాల సెంటర్‌లో పరీక్షకు హాజరయ్యారు. తండ్రి, కొడుకు గ్రూప్–2 పరీక్షలు రాయనుండడంతో ఎవరూ ఉద్యోగం సాధిస్తారో అని గ్రామస్తులు ముచ్చటిస్తున్నారు.