మిగులు భూములు ప్రభుత్వానికి అప్పగింత | excess lands sumbits to govt | Sakshi
Sakshi News home page

మిగులు భూములు ప్రభుత్వానికి అప్పగింత

Published Tue, Jul 26 2016 9:53 PM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM

మిగులు భూములు ప్రభుత్వానికి అప్పగింత

మిగులు భూములు ప్రభుత్వానికి అప్పగింత

ఇబ్రహీంపట్నం :
గ్రామానికి చెందిన మాజీ సర్పంచి మల్లెల అనంత పద్మనాభరావు, ఆయన భార్య అంజనాదేవి పేరిట ఉన్న మిగులు భూములు భూపరిమితిచట్టం కింద ప్రభుత్వానికి మంగళవారం అప్పగించారు. ఇబ్రహీంపట్నం తహసీల్దార్‌ కార్యాలయంలో సబ్‌ కలెక్టర్‌ సృజన తహసీల్దార్‌ ఇంతియాజ్‌ పాషాను కలసి భూ రికార్డులు, రాతపత్రం అందజేశారు. ఇబ్రహీంపట్నం సడక్‌రోడ్డు సమీపంలో ఉన్న 39.87ఎకరాలు, పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం పెదపాడు గ్రామంలోని 10 ఎకరాల మాగాణి భూమి మొత్తం 49.87 ఎకరాలు రాసిచ్చారు. గతంలో సడక్‌రోడ్డు సమీపంలో ఉన్న 35 ఎకరాలు సీలింగ్‌లో ప్రభుత్వం సేకరించింది. అమరావతి రాజధాని అవసరాల నిమిత్తం ఈ భూమిని వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు. పత్రాల అందించిన వారిలో పద్మనాభరావు కుమారుడు మల్లెల శ్రీనివాస చౌదరి పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement