స్కూటర్ డిక్కీలో రూ. 20 వేలు చోరీ
Published Tue, Oct 4 2016 4:39 PM | Last Updated on Sat, Sep 15 2018 7:51 PM
ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని కో-ఆపరేటివ్ బ్యాంక్ ఎదుట పెట్టిన స్కూటర్‌లోంచి రూ.20 వేలు చోరీ జరిగింది. ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం గ్రామానికి చెందిన హరికృష్ణ అనే రైతు మంగళవారం మధ్యాహ్నం సహకార బ్యాంకులో క్రాప్ లోన్ తీసుకుని రూ.20 వేల నగదును స్కూటర్ డిక్కీలో పెట్టాడు. అనంతరం వేరే పనిమీద పక్కకు వెళ్లగా నగదును దుండగులు దోచుకెళ్లారు. తిరిగివచ్చి చూస్తే డిక్కీ తెరిచి ఉండడంతో చోరీ జరిగిన విషయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement