ఇబ్రహీంపట్నం (కృష్ణాజిల్లా) : శ్రావణ శుక్రవారం సందర్భంగా గుడికి వెళ్లొచ్చేసరికి దొంగలు ఇంట్లో విలువైన వస్తువులను కొల్లగొట్టారు. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో కలసి శుక్రవారం ఉదయం గుడికి వెళ్లారు. సాయంత్రం 4 గంటలకు తిరిగి వచ్చి చూసేసరికి దొంగలు ఇంట్లోని బీరువాలో ఉంచిన 14 కాసుల బంగారు ఆభరణాలతోపాటు రూ.15వేల నగదును ఎత్తుకుపోయినట్టు గుర్తించారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. జాగిలాలలో సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.