ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట శనివారం మధ్యాహ్నం రూ.4 లక్షల వరకు చోరీ జరిగింది.
ఇబ్రహీంపట్నం (రంగారెడ్డి జిల్లా) : ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట శనివారం మధ్యాహ్నం రూ.4 లక్షల వరకు చోరీ జరిగింది. హైదరాబాద్ హబ్సీగూడ ప్రాంతానికి చెందిన ఆంటోనీ అనే వ్యక్తి రిజిస్ట్రేషన్ కోసం ఇన్నోవా వాహనంలో ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్దకు వెళ్లారు.
రూ.4 లక్షల వరకు నగదు ఉన్న బ్యాగును వాహనం లోపలే ఉంచి కార్యాలయంలోకి వెళ్లారు. ఆ సమయంలో ఓ ఆగంతకుడు కారు అద్దాలు ధ్వంసం చేసి లోపలున్న నగదు బ్యాగుతో పరారయ్యాడు. బాధితుడు ఫిర్యాదు మేరకు సీఐ జగదీశ్వర్ దర్యాప్తు చేస్తున్నారు.