సిగరెట్ కావాలంటూ కిరాణ దుకాణం వద్దకు వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని దుండగులు షాపు యజమానురాలి మెడలోని బంగారు పుస్తెలతాడును దోచుకుపోయారు.
ఇబ్రహీంపట్నం (రంగారెడ్డి) : సిగరెట్ కావాలంటూ కిరాణ దుకాణం వద్దకు వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని దుండగులు షాపు యజమానురాలి మెడలోని బంగారు పుస్తెలతాడును దోచుకుపోయారు. ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలోని చోటుచేసుకుంది. సీఐ జగదీశ్వర్ కథనం ప్రకారం... సాహెబ్‌గూడకు చెందిన వట్నాల పుష్పలత(35) గ్రామంలో కిరాణ దుకాణంలో నిర్వహిస్తుంటుంది. ఇద్దరు యువకులు పల్సర్ బైక్‌పై షాపు వద్దకు వచ్చి సిగరెట్లు కావాలని అడిగారు. ఆమె సిగరెట్ ఇచ్చేలోగానే మెడలోని 5 తులాల బంగారు పుస్తెలతాడును లాక్కొని పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.