మాదిగల సత్తా చాటాలి | MEF Meeting | Sakshi
Sakshi News home page

మాదిగల సత్తా చాటాలి

Published Sat, Oct 29 2016 10:46 PM | Last Updated on Mon, Sep 4 2017 6:41 PM

మాదిగల సత్తా చాటాలి

మాదిగల సత్తా చాటాలి

ఇబ్రహీంపట్నం : ధర్మయుద్ధ మహాసభను జయప్రదం చేసి మాదిగల సత్తా చాటాలని మదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. స్థానిక పలగానీ హోటల్‌లో మాదిగ ఉద్యోగుల సమాఖ్య(ఎంఈఎఫ్‌) సమావేశం శుక్రవారం రాత్రి నిర్వహించారు. సమావేశానికి ఎన్టీటీపీఎస్‌ ఏడీఈ కిరణ్‌కుమార్‌ అధ్యక్షత వహించారు. మందా కృష్ణమాదిగ మాట్లాడుతూ నవంబర్‌ 20వ తేదీ హైదరాబాద్‌లో నిర్వహించనున్న ధర్మయుద్ధ మహాసభను జయప్రదం చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ రాష్ట్ర సీఎం కె.చంద్రశేఖర్‌రావులకు కనువిప్పు కలగించాలని కోరారు.  లక్షలాదిమందిగా తరలివచ్చేందుకు మాదిగ ఉద్యోగులు తమవంతు సహకారం అందించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మయ్య మాదిగ, ఉద్యోగ సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమోతు సుబ్బారావు, ఎమ్మార్పీఎస్‌ మండల అధ్యక్షుడు మందా విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.




 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement