
వైఎస్ జగన్ తో మందకృష్ణ మాదిగ భేటీ
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. అసెంబ్లీ ఛాంబర్లో సోమవారం వైఎస్ జగన్తో ఆయన కలిశారు. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు మద్దతు ఇవ్వాలని మందకృష్ణ ఈ సందర్భంగా వైఎస్ జగన్ను కోరారు. ఎస్సీ వర్గీకరణపై పార్టీలో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని వైఎస్ జగన్ హామీ ఇచ్చినట్లు సమాచారం.