MRPS President
-
'డిప్యూటీ సీఎం కడియం మోసం చేస్తున్నారు'
హైదరాబాద్ : ఎస్సీ వర్గీకరణ కోరుతూ డిసెంబర్ 17న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తామని ఎమ్మార్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. గురువారం హైదరాబాద్లో మందకృష్ణ మాదిగ విలేకర్లతో మాట్లాడుతూ... ఎస్సీ వర్గీకరణ పేరుతో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాల మాదిగలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించి న్యూఢిల్లీకి ప్రతినిధి బృందాన్ని తీసుకెళ్లాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. -
'బాబుకు ఉసురు తప్పకుండా తగులుతుంది'
గుంటూరు: ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ శుక్రవారం గుంటూరులో నిప్పులు చెరిగారు. చంద్రబాబు కష్టాల్లో ఉన్నప్పుడు ఎంఆర్పీఎస్ ఆదుకుందని ఆయన గుర్తు చేశారు. 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా ఉన్నారు. అయితే ఆ అంశంపై ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. సమాధానం చెప్పాలని నిలదీశారు. మాదిగల ఉసురు చంద్రబాబుకు తప్పకుండా తగులుతుందని మందకృష్ణ మండిపడ్డారు. -
నమ్మించి మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట
ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు నాయుడుపేట : నమ్మించి మోసం చేయడంలో ముఖ్యమంత్రి చందబ్రాబునాయుడు దిట్టని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు పేర్కొన్నారు. నాయుడుపేట ఆర్ అండ్ బీ అతిథి గృహంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాదిగలతో ఉద్యమాలు చేయించి రిజర్వేషన్ను అమలు చేస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. మాదిగ జనాలతో పాదయాత్ర చేయించుకుని ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన చంద్రబాబు అదే మాదిగలను దూరం చేశారన్నారు. ఈ విధంగా మాదిగలను మోసం చేయడాన్ని అన్ని వర్గాల వారు గమనిస్తూనే ఉన్నారని చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ నాయకులు నారాయణ, గోవిందువాసుమాదిగ, వెంకటేశ్వర్లు, కంటేపల్లి రాజేష్, రవి, తదితరులు పాల్గొన్నారు. -
'చంద్రబాబు సభలను అడ్డుకుంటాం'
ఒంగోలు: ఆదివారం నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనలను అడ్డుకుంటామని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. అంతేకాకుండా మాదిగ రిజర్వేషన్ల వర్గీకరణ చేపట్టని ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా మార్చి 10 వ తేదీన అసెంబ్లీని ముట్టడిస్తామన్నారు. -
'రాజయ్య ది ముమ్మాటికీ రాజకీయ హత్యే'
హైదరాబాద్: మాదిగ సామాజిక వర్గానికి చెందిన తాటికొండ రాజయ్యను ఉద్దేశపూర్వకంగానే పదవినుంచి తొలగించారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వ్యాఖ్యానించారు. రాజయ్య ఏ తప్పూ చేయకపోయినా తప్పు చేశాడనటం అన్యాయమని తెలిపారు. ఆయన సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు. కేసీఆర్ చేసింది ముమ్మాటికీ రాజకీయ హత్యేనన్నారు. రాజయ్యను మంత్రి పదవి నుంచి తొలగించి దళితులను అవమానించారని మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. -
వైఎస్ జగన్ తో మందకృష్ణ మాదిగ భేటీ
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. అసెంబ్లీ ఛాంబర్లో సోమవారం వైఎస్ జగన్తో ఆయన కలిశారు. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు మద్దతు ఇవ్వాలని మందకృష్ణ ఈ సందర్భంగా వైఎస్ జగన్ను కోరారు. ఎస్సీ వర్గీకరణపై పార్టీలో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని వైఎస్ జగన్ హామీ ఇచ్చినట్లు సమాచారం. -
'టీఆర్ఎస్ ... దొరల పార్టీ'
మెదక్: టీఆర్ఎస్ దొరల పార్టీ, కుటుంబ పార్టీ అని ఎమ్ఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణమాదిగ అభివర్ణించారు. మెదక్ లోక్సభ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రచారం కోసం వచ్చిన ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ డిప్యూటీ సీఎం రాజయ్యను కేసీఆర్ అవమానించారని ఆరోపించారు. అందుకు నిరసనగా రేపటి నుంచి 10 రోజులపాటు నిరసనలు చేపడుతున్నట్లు మందకృష్ణ మాదిగ ప్రకటించారు.