
'రాజయ్య ది ముమ్మాటికీ రాజకీయ హత్యే'
హైదరాబాద్: మాదిగ సామాజిక వర్గానికి చెందిన తాటికొండ రాజయ్యను ఉద్దేశపూర్వకంగానే పదవినుంచి తొలగించారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వ్యాఖ్యానించారు. రాజయ్య ఏ తప్పూ చేయకపోయినా తప్పు చేశాడనటం అన్యాయమని తెలిపారు.
ఆయన సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు. కేసీఆర్ చేసింది ముమ్మాటికీ రాజకీయ హత్యేనన్నారు. రాజయ్యను మంత్రి పదవి నుంచి తొలగించి దళితులను అవమానించారని మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు.