సాక్షి, హైదరాబాద్: కారెక్కడానికి మరో జిల్లా కలెక్టర్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఉద్యోగ విరమణకు కొన్ని నెలల ముందు అప్పటి సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి గులాబీ కండువా కప్పుకొని పెద్దల సభలో అడుగుపెట్టగా.. ఆయన బాటలో నడిచేందుకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఎల్. శర్మన్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. రెండు నెలల్లో రిటైర్ కానున్న శర్మన్.. రాజకీయ అరంగేట్రం దాదాపు ఖరారైనట్లు తెలిసింది.
కలెక్టర్ హోదాలో క్షేత్ర స్థాయిలో జనం సమస్యలు తెలుసుకునేందుకు నిత్యం బస్తీలు, మురికివాడల్లో మోటార్ సైకిల్‌పై పర్యటించే ఆయన.. ఉద్యోగ విరమణ తర్వాత కూడా ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాలు సరైన వేదికని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. రాజకీయ తీర్థం తీసుకొని రిజర్వ్‌డ్ స్థానాలైన ఆదిలాబాద్ లోక్‌సభ లేదా ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగాలని యోచిస్తున్నట్లు సమాచారం.
చేరిక వార్తలపై ఆయన స్పందిస్తూ.. రిటైర్‌మెంట్‌కు రెండు నెలలు సమయం ఉంది కదా అని దాటవేస్తున్నారు. ఆ తర్వాత ఏదైనా జరగవచ్చని చెబుతున్నారు. శర్మన్ గ్రూప్–1 అధికారిగా చేరి ఐఏఎస్ అయ్యే వరకు వివిధ పోస్టులు నిర్వర్తించారు. జీహెచ్‌ఎంసీ అదనపు కార్యదర్శిగా, మహబూబ్‌నగర్ జేసీగా, నాగర్‌కర్నూల్ కలెక్టర్‌గా పనిచేశారు.
క్షేత్రస్థాయి పర్యటన చేసి..
ఉద్యోగ విరమణ తర్వాత క్షేత్ర స్థాయి పర్యటనలతో జనం మన్ననలు పొందా లని, ఆ తర్వాత రాజకీయాల్లో రంగప్రవే శం చేయాలని శర్మన్ భావిస్తున్నట్లు తెలు స్తోంది. నియోజకవర్గాల్లో పర్యటించి సమస్యలు గుర్తిస్తూ జనంలో మమేకం కావాలని ప్రణాళిక రూపొందిస్తున్నట్లు అయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే ఆక్కడి రాజకీయ నాయకులతో ఆయనకు మంచి సంబంధాలున్నాయి. బంధువులు చాలా మంది ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment