Hyderabad collector
-
కాసేపు టీచర్‌గా మారిన హైదరాబాద్ కలెక్టర్
నాంపల్లి: హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికార హోదాను కాసేపు పక్కన పెట్టి టీచర్‌గా మారిపోయారు. తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు చెప్పి ఆకట్టుకున్నారు. టీచర్లలో ఉత్తేజం నింపారు. ఈ సన్నివేశం గురువారం మల్లేపల్లిలో చోటుచేసుకుంది. స్థానిక తెలుగు, ఉర్దూ మీడియం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని అన్ని తరగతి గదు లను సందర్శించి పిల్లలతో ముచ్చటించారు. విద్యా ర్థులు చదువుతున్న తీరును గమనించారు. ఈ క్రమంలో ఆయన విద్యార్థులకు పాఠాలు చెప్పారు. ఉపాధ్యాయులతో బోధనలు చేయించారు. ‘పాఠం అర్థమైందా పిల్లలూ..’అని ఆరా తీశారు. కార్యక్రమంలో నాంపల్లి ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్, డీఈఓ రోహిణి, తహసీల్దార్ జ్యోతి పాల్గొన్నారు. ఇన్స్పెక్టర్కు చురకలు.. మల్లేపల్లి ఉర్దూ మీడియం ప్రభుత్వ ఉన్నత పాఠశాల తలుపులను ఆకతాయి లు రాత్రివేళల్లో పగులగొట్టి లోనికి చొరబడి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని టీచర్లు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. గతంలోనూ స్కూల్లోని కంప్యూటర్లు ఎత్తుకెళ్లారని చెప్పారు. అయితే అక్కడే ఉన్న హబీబ్‌నగర్ ఇన్స్పెక్టర్ టంగుటూరి రాంబాబును పిలిచి ‘దొంగలు పడితే ఏం చేస్తున్నారు’ అని కలెక్టర్ చురకలు అంటించారు. వెంటనే దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. కాగా, కలెక్టర్ నాంపల్లి ఏరియా ఆసుపత్రికి చేరుకుని అక్కడి వైద్యసేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. -
హైదరాబాద్ కలెక్టర్‌గా అమయ్‌కుమార్‌కు అదనపు బాధ్యతలు
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా (ఎఫ్ఏసీ–పూర్తిఅదనపు బాధ్యతలు) రంగారెడ్డి జిల్లా కలెక్టర్ దుగ్యాల అమయ్‌కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఎల్.శర్మన్ గురువారం (జూన్ 30న) ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో అమయ్‌కుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. (క్లిక్: కల్నల్ సంతోష్‌బాబు సతీమణికి రూ.1.25 కోట్లు) -
కారెక్కనున్న హైదరాబాద్ కలెక్టర్!
సాక్షి, హైదరాబాద్: కారెక్కడానికి మరో జిల్లా కలెక్టర్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఉద్యోగ విరమణకు కొన్ని నెలల ముందు అప్పటి సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి గులాబీ కండువా కప్పుకొని పెద్దల సభలో అడుగుపెట్టగా.. ఆయన బాటలో నడిచేందుకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఎల్. శర్మన్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. రెండు నెలల్లో రిటైర్ కానున్న శర్మన్.. రాజకీయ అరంగేట్రం దాదాపు ఖరారైనట్లు తెలిసింది. కలెక్టర్ హోదాలో క్షేత్ర స్థాయిలో జనం సమస్యలు తెలుసుకునేందుకు నిత్యం బస్తీలు, మురికివాడల్లో మోటార్ సైకిల్‌పై పర్యటించే ఆయన.. ఉద్యోగ విరమణ తర్వాత కూడా ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాలు సరైన వేదికని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. రాజకీయ తీర్థం తీసుకొని రిజర్వ్డ్ స్థానాలైన ఆదిలాబాద్ లోక్‌సభ లేదా ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగాలని యోచిస్తున్నట్లు సమాచారం. చేరిక వార్తలపై ఆయన స్పందిస్తూ.. రిటైర్మెంట్కు రెండు నెలలు సమయం ఉంది కదా అని దాటవేస్తున్నారు. ఆ తర్వాత ఏదైనా జరగవచ్చని చెబుతున్నారు. శర్మన్ గ్రూప్–1 అధికారిగా చేరి ఐఏఎస్ అయ్యే వరకు వివిధ పోస్టులు నిర్వర్తించారు. జీహెచ్ఎంసీ అదనపు కార్యదర్శిగా, మహబూబ్‌నగర్ జేసీగా, నాగర్‌కర్నూల్ కలెక్టర్‌గా పనిచేశారు. క్షేత్రస్థాయి పర్యటన చేసి.. ఉద్యోగ విరమణ తర్వాత క్షేత్ర స్థాయి పర్యటనలతో జనం మన్ననలు పొందా లని, ఆ తర్వాత రాజకీయాల్లో రంగప్రవే శం చేయాలని శర్మన్ భావిస్తున్నట్లు తెలు స్తోంది. నియోజకవర్గాల్లో పర్యటించి సమస్యలు గుర్తిస్తూ జనంలో మమేకం కావాలని ప్రణాళిక రూపొందిస్తున్నట్లు అయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే ఆక్కడి రాజకీయ నాయకులతో ఆయనకు మంచి సంబంధాలున్నాయి. బంధువులు చాలా మంది ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. -
గంటలోగా వస్తారా, రారా?.. అరగంటలోనే హాజరైన కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ కలెక్టర్ల తీరు పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం బేగంపేట టూరిజం ప్లాజాలో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ (దిశ) కమిటీ సమావేశం ఏర్పాటు చేయగా, కమిటీ చైర్మన్‌గా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హాజరయ్యారు. సమావేశానికి జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్లు రాకపోవడం కేంద్ర మంత్రికి కోపం తెప్పించింది. జిల్లా సమావేశానికి కీలక అధికారులు రాకపోవడమేంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గంట సమయం ఇచ్చి.. ఈలోగా రాకపోతే చర్యలు తీవ్రంగా ఉంటాయని వారికి అల్టిమేటం పంపారు. సమావేశం ప్రారంభించిన అరగంటలోపు జీహెచ్ఎంసీ కమిషనర్, కలెక్టర్ హాజరయ్యా రు. గతంలోనూ కిషన్ రెడ్డికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. హైదరాబాద్ వరదల సమయంలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన కిషన్‌రెడ్డి వెంట కనీసం ఆర్డీవో స్థాయి అధికారులు కూడా హాజరుకాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. మరోమారు అలాంటి అనుభవమే ఎదురుకావడంతో కిషన్ రెడ్డి ఆగ్రహానికి గురయ్యారు. చదవండి: Hyderabad: బుల్లెట్ బండి..పట్నం వస్తోందండీ రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి.. రాజకీయాలకతీతంగా పార్టీలన్నీ హైదరాబాద్ నగరాభివృద్ధికి కృషి చేయాలని సమావేశంలో కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. కేంద్ర పథకాల అమలు, లాఅండ్ ఆర్డర్, మహిళా సంక్షేమం, మధ్యాహ్న భోజన పథకం తదితర అంశాలపై చర్చించారు. జాతీయ ఆహార భద్రతా చట్టం, వన్ నేషన్–వన్ రేషన్లపై సమీక్షించారు. జిల్లాకు సంబంధించి కేంద్రం నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తామని హామీ ఇచ్చారు. అధికారులు పూర్తి సమాచారంతో రావాలని ఆదేశించారు. -
బైక్‌పై వెళ్లి.. ఆకస్మిక తనిఖీలు చేపట్టిన హైదరాబాద్ కలెక్టర్
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్య హైదరాబాద్‌లో భాగంగా కరోనా మహమ్మారి కట్టడి కోసం వంద శాతం లక్ష్యంగా కొనసాగుతున్న కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంపై హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆదివారం సికింద్రాబాద్ రసూల్‌పురాలోని గన్‌బజార్ కమ్యూనిటీ హాల్లో నిర్వహిస్తున్న వాక్సి నేషన్ సెంటర్‌ను ఆయన సందర్శించారు. కారు వెళ్లలేని కాలనీలకు కలెక్టర్ బైక్‌పై వెళ్లారు. ఓ వ్యక్తి బైక్ నడుపుతుండగా ఆయన వెనక కూర్చుని తనిఖీలకు దిగారు. ఇంటికి స్టిక్కర్ అంటించారా? లేదా? అని పరిశీలించారు. అధికారులు వచ్చి వాక్సినేషన్ గురించి వివరించి వివరాలు సేకరించారా? లేదా? అని స్థానికులను ఆరా తీశారు. ఆయన వెంట డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటి తదితరులు ఉన్నారు. చదవండి: కత్తులు పట్టుకొని బాలీవుడ్ డైలాగులు.. వాట్సాప్ స్టేటస్లు -
కలెక్టర్ మేడం.. చాలా మంచివారు
సాక్షి, హైదరాబాద్ : లాక్‌డౌన్‌తో హైదరాబాద్‌లో చిక్కుకున్న సౌదీ అరేబియాకు చెందిన ఓ మహిళ తిరిగి స్వదేశం వెళ్లేందుకు హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి సహకరించారు. సౌదీ అరేబియాకు చెందిన 54 ఏళ్ల ముస్లిం మహిళ తమ బంధువుల్ని కలిసేందుకు జనవరి 31న హైదరాబాద్‌కు వచ్చారు. ఏప్రిల్ 17న ఇక్కడి నుంచి తిరిగి వెళ్లేందుకు సౌదీ ఎయిర్‌లైన్స్ ద్వారా అడ్వాన్స్ టికెట్ కూడా బుక్ చేసుకున్నారు. కాగా, కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్‌తో అంతర్జాతీయ విమాన సర్వీసులు బంద్ కావడంతో ఆమె తిరిగి వెళ్లేందుకు వీలు కాలేదు. (ఇంటి అద్దె రద్దు చేసిన వైద్యుడు) లాక్డౌన్ సడలించడంతో తిరిగి వెళ్లేందుకు కోవిడ్ పరీక్షలు, క్లియరెన్స్ సర్టిఫికెట్ అవసరమైంది. హైదరాబాద్‌లోని రాయల్ కాన్సులేట్ ప్రతినిధి, న్యాయవాది మహమ్మద్ ఉస్మాన్ స్పందించి..ఆ మహిళ తిరిగి స్వదేశానికి వెళ్లేందుకు సత్వర పరీక్షల కోసం సహకరించాలని ఈ–మెయిల్ ద్వారా కలెక్టర్‌ను కోరారు. స్పందించిన కలెక్టర్ వెంటనే ఆ మహిళకు పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్ జారీ చేసే విధంగా వైద్యశాఖ అధికారులకు ఆదేశించారు. ఈ మేరకు వైద్యాధికారులు తక్షణం స్పందించడంతో ఒక్క రోజులోనే సదరు మహిళకు పరీక్షలు పూర్తి కావడంతో పాటు నివేదిక అందుకుంది. పరీక్షల్లో నెగిటివ్ రావడంతో తిరిగి సౌదీ వెళ్లేందుకు క్లియరెన్స్ లభించింది. దీంతో ఆమె సోమవారం ఢిల్లీకి వెళ్లి అక్కడి నుంచి సౌదీకి ప్రయాణమైంది. ఈ సందర్భంగా కలెక్టర్ మేడం చాలా మంచివారు అంటూ సౌదీ మహిళ పేర్కొంది.(గ్రేటర్‌పై కరోనా పంజా) -
ఆంక్షలు లేవ్, ప్రజావాణికి ఎవరైనా రావొచ్చు
సాక్షి, హైదరాబాద్: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ‘ప్రజావాణి’కి ఎవరైనా రావొచ్చని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ మాణిక్ రాజ్ కన్నన్ స్పష్టం చేశారు. ప్రజావాణికి జర్నలిస్టులకు అనుమతి లేదంటూ సమావేశ మందిరం నుంచి బయటికి పంపించిన జాయింట్ కలెక్టర్ రవి తీరును మంగళవారం పాత్రికేయులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కలెక్టర్.. జర్నలిస్టుల ప్రవేశం, కవరేజ్‌పై ఎలాంటి ఆకాంక్షలు లేవని వెల్లడించారు. ప్రజావాణికి అందరూ హాజరు కావచ్చని, సమావేశ మందిరంలో ఉండవచ్చన్నారు. ప్రత్యేకంగా ఆహ్వానం కానీ, రావద్దన్న ఆంక్షలు గానీ లేవన్నారు. సమావేశ మందిరంలో అధికారుల మాదిరిగా మీడియాకు ప్రత్యేకంగా సీట్ల కేటాయింపు లేకున్నా.. ఖాళీగా ఉన్న సీట్లలో అధికారులకు ఇబ్బంది కలుగకుండా జర్నలిస్టులు కూర్చోవచ్చన్నారు. ఎప్పుడూ లేని విధంగా ప్రజావాణి సమావేశ మందిరం నుంచి జర్నలిస్టులను బయటికి పంపించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో, దానికి గల కారణాలపై విచారణ చేస్తానన్నారు. జాయింట్ కలెక్టర్ రవి నుంచి వివరాలు తెలుసుకుంటానని కలెక్టర్ మాణిక్ రాజ్‌తెలిపారు. -
పోలింగ్ రోజు ఎన్నిసార్లయినా వోటెయ్యొచ్చు
సాక్షి, హైదరాబాద్: ఎస్తోనియా.. ఉత్తర ఐరోపాలోని ఓ బాల్డిక్ దేశం. 45 వేల చదరపు కిలోమీటర్ల విసీర్ణం.. 13 లక్షల జనాభాతో 1991లో రష్యా నుంచి స్వతంత్ర దేశంగా అవతరించింది. కాగిత రహిత పాలనకు 1995లోనే గుడ్‌బై చెప్పి ‘ఆన్లైన్’ పాలనకు శ్రీకారం చుట్టింది ఇక్కడి ప్రభుత్వం. పూర్తి స్థాయిలో ఈ–గవర్నెన్స్ అమలు చేస్తున్న ప్రపంచంలో ఏకైక దేశం ఎస్తోనియా. స్కూల్ ప్రోగ్రెస్ కార్డు నుంచి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే వరకు అంతా ఆన్లైన్ విధానం అమలు చేస్తుండడం ఇక్కడి ప్రత్యేకత. ‘డిజిటల్ ఇండియా’లో భాగంగా ఈ–గవర్నెన్స్ లీడర్‌షిప్‌పై అధ్యయనానికి గత నెలలో కేంద్ర ప్రభుత్వం ఓ బృందాన్ని ఆ దేశ పర్యటనకు పంపించింది. పలు రాష్ట్రాలకు చెందిన 25 మంది సీనియర్ అధికారులున్న ఈ బృందంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రాఘునందన్ రావు కూడా ఒకరు. ఈ బృందం ఎస్తోనియాలో పర్యటించి అక్కడి ఈ–గవర్నెన్స్‌పై అధ్యయనం చేసింది. ఆ దేశంలో పర్యటించి వచ్చిన ఆయన గురువారం అక్కడి వివరాలను ‘సాక్షి‘కి వివరించారు. ఆ వివరాలు కలెక్టర్ మాటల్లోనే.. అక్కడ పారదర్శంగా సేవలు ఎస్తోనియా చాలా చిన్న దేశం. అక్కడి ప్రజలు చదువుకున్న వారు కావడంతో ఈ–గవర్నెన్స్ అమలు సాధ్యపడింది. ఆర్థిక లావాదేవీలు, పన్నుల చెల్లింపు, ఆరోగ్య రిపోర్డులతో పాటు అన్ని అనుమతులు ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా సేవలందుతున్నాయి. ప్రపంచ దేశాలన్నీ ఎస్తోనియాను ఆదర్శంగా తీసుకుంటున్నాయి. ఆ దేశంలో వలే ఇక్కడా ఈ–గవర్నెన్స్‌తో పౌరులకు సత్వర సేవలతో సుపరిపాలను అందించవచ్చు. డిజిటల్ ఐడెంటిటీ కార్డులు ఆ దేశంలో పౌరులకు ప్రత్యేకంగా డిజిటల్ ఐడెండిటీ కార్డులును జారీ చేశారు. డెబిట్ కార్డు తరహాలో అందులో ఒక చిప్ ఉంటుంది. వ్యక్తికి సంబంధించిన సమాచారమంతా ఈ చిప్‌లో రికార్డవుతుంది. ఈ కార్డును అన్ని రకాలుగా వినియోగించుకోవచ్చు. ఒక వ్యక్తి దేశంలో ఎక్కడ ఉంటున్నాడో తెలుసుకునేందుకు ఈ–రెసిడెన్సీని అమలుచేస్తున్నారు. ఇక వైద్య రంగంలోనూ ఈ– గవర్నెన్స్ ఉంది. ఈ–హెల్త్ రికార్డులు, ఈ– ప్రిస్క్రిప్షన్ విధానాన్ని అక్కడ అనుసరిస్తున్నారు. సదరు వ్యక్తి అనుమతి లేకుండా స్టెతస్కోపు పెట్టడానికి కూడా వీల్లేదు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ సైతం ఆన్లైన్లోనే ఉంటుంది. ఎంతో గోప్యంగా సమాచారం ఈ–గవర్నెన్స్‌లో భాగంగా ఆన్లైన్లో పొందుపరిచే సమాచారాన్ని అత్యంత గోప్యంగా ఉంటుంది. ఒకరి అనుమతి లేకుండా మరోకరు సమాచారం చూడ్డానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర వ్యక్తులకు తెలియకుండా సిస్టం హార్డ్ డిస్క్ జాగ్రత్తలు తీసుకుంటుంది. ఒకవేళ చూస్తే వెంటనే సదరు వ్యక్తికి తెలిసిపోతుంది. అనుమతి లేకుండా సమాచారం చూడడం అక్కడ చట్టరిత్యా నేరం. క్రిమినల్ కేసు పెట్టవచ్చు. ఉదాహరణకు భార్య బ్యాంక్ అకౌంట్ వివరాలు భర్తకు, భర్త ఆస్తుల వివరాలు భార్యకు తెలియనంత రహస్యంగా ఈ–పరిపాలన సాగుతోంది. కనీసం పన్నుల విధింపు, చెల్లింపు వివరాలు సైతం అధికారులు సైతం చూడ్డానికి లేదు. ఒకసారి అనుమతితో చూసినా కంప్యూటర్లో భద్రపర్చుకునేందుకు సాఫ్ట్వేర్ ఆమోదించదు. ఆన్లైన్లోనే ఓటింగ్.. ఆ దేశంలో పార్లమెంట్ వ్యవస్థ ఉంది. ప్రజలు ఓటు హక్కు ద్వారా ఎంపీలను ఎన్నుకుంటారు. ఆన్లైన్ ద్వారా కూడా ఓటు వేయవచ్చు. పోలింగ్ రోజు గడువులోగా ఎన్నిసార్లు అయినా ఓటు వేయవచ్చు. కానీ చివరి ఓటు ఎవరికి వేస్తామో అది మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. అక్కడి ప్రజలు 35 శాతం, 65 శాతం బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కేబినెట్లో మంత్రులను ఎంపీయేతరులను ఎన్నుకుంటారు. మంత్రిగా ఎన్నుకుంటే ఎంపీగా వారి స్థానంలో ఇతరులు వ్యవహరిస్తారు. మంత్రిగా రాజీనామా చేసి తిరిగి ఎంపీగా చేరవచ్చు. డేటా ప్రైవసీ చట్టం అవసరం ఈ–గవర్నెన్స్ అమలుకు డేటా ప్రైవసీ చట్టం అవసరం. ఇటీవల న్యాయమూర్తి శ్రీకృష్ణ సారధ్యంలోని కమిటీ ఈ–గవర్నెన్స్ అమలుపై పలు సూచనలు చేసింది. సిటిజన్ డేటా గోపత్య, అనుమతి లేకుండా చూడడం నేరంగా పరిగణించాలని ప్రతిపాదించింది. పటిష్ట చట్టం రూపొందిస్తే కానీ ఈ–గవర్నెన్స్ పూర్తిగా అమలు అసాధ్యం. పన్నుల చెల్లింపునకు ఈ విధానం ఎంతో ఉపయోగపడుతుంది. -
హైదరాబాద్ కలెక్టర్‌గా యోగితా రాణా
- నిజామాబాద్ నుంచి బదిలీ.. జేసీకి అదనపు బాధ్యతలు హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ యోగితా రాణాను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆమెను హైదరాబాద్ కలెక్టర్‌గా నియమిస్తున్నట్లు బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. నిజామాబాద్ జాయింట్ కలెక్టర్(జేసీ) రవీందర్ రెడ్డికి కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు కేటాయించారు. హైదరాబాద్ కలెక్టర్‌గా పనిచేసిన రాహుల్ బొజ్జా.. దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడంతో జేసీ ప్రశాంతి కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. మూడు నెలల తర్వాత హైదరాబాద్ జిల్లాకు పూర్తి స్థాయి కలెక్టర్‌గను నయమించారు. కాగా, రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో యోగితా రాణా బదిలీ అవుతారని కొద్ది రోజులుగా ప్రచారం జరుతుండటం గమనార్హం. సమర్థురాలైన అధికారణిగా పేరు పొందిన యోగితా.. ఈ-నామ్ అమలులో జాతీయ స్థాయి పురస్కారం దక్కించుకున్నారు. గత సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా ప్రధాని మోదీ నుంచి ఆమె విశిష్టసేవ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే.