Hyderabad Collector L Sharman Monitors Covid Vaccination Drive - Sakshi
Sakshi News home page

Hyderabad Collector L Sharman: బైక్‌పై వెళ్లి.. తనిఖీలు చేసి..   

Published Mon, Sep 6 2021 7:43 AM | Last Updated on Mon, Sep 6 2021 10:19 AM

Hyd Collector L Sharman Visits Slum At Rasoolpura On Bike - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆరోగ్య హైదరాబాద్‌లో భాగంగా  కరోనా మహమ్మారి కట్టడి కోసం వంద శాతం లక్ష్యంగా కొనసాగుతున్న కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమంపై హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ శర్మన్‌ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆదివారం సికింద్రాబాద్‌ రసూల్‌పురాలోని గన్‌బజార్‌ కమ్యూనిటీ హాల్‌లో నిర్వహిస్తున్న వాక్సి నేషన్‌ సెంటర్‌ను ఆయన సందర్శించారు. కారు వెళ్లలేని కాలనీలకు కలెక్టర్‌ బైక్‌పై వెళ్లారు. ఓ వ్యక్తి బైక్‌ నడుపుతుండగా ఆయన వెనక కూర్చుని తనిఖీలకు దిగారు. ఇంటికి స్టిక్కర్‌ అంటించారా? లేదా? అని పరిశీలించారు. అధికారులు వచ్చి వాక్సినేషన్‌ గురించి వివరించి వివరాలు సేకరించారా? లేదా? అని స్థానికులను ఆరా తీశారు.  ఆయన వెంట డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ వెంకటి తదితరులు ఉన్నారు.   
చదవండి: కత్తులు పట్టుకొని బాలీవుడ్‌ డైలాగులు.. వాట్సాప్‌ స్టేటస్‌లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement