sharman
-
రివిజన్తో విన్!
పట్టుదలతో చదివితే లక్ష్యాన్ని చేరవచ్చు. ఆశయసాధనలో అలుపెరగక ముందుకు సాగితే విజయం సాగిలపడుతుంది. నిరంతర శ్రమతో.. అకుంఠిత దీక్షతో అహరహం తపిస్తే గెలుపు బాట తథ్యం అంటున్నారు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్. సర్కారీ కొలువుల నోటిఫికేషన్లు వెలువడనున్న నేపథ్యంలో గ్రూప్స్ అభ్యర్థులకు సూచనలు, సలహాలు అందించారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ఆయన ముచ్చటించారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే ముందు సిలబస్‌పై అభ్యర్థులకు అవగాహన అవసరమన్నారు. దానికి అనుగుణంగా మెటీరియల్‌ను సమకూర్చుకోవాలని సూచించారు. ముఖ్యంగా సంబంధిత సబ్జెక్టులపై పట్టు సాధించాలని, జనరల్ నాలెడ్జి పెంచుకోవాలన్నారు. పరీక్షల్లో తొలి మెట్టుకు ఈ రెండు అంశాలు దోహదపడతాయని శర్మన్ స్పష్టం చేశారు. ఆయన ఇంకా ఏం సూచించారంటే.. – సాక్షి, హైదరాబాద్ ఎంత అర్థమైందన్నదే పాయింట్ చదవడంతో పాటు నిరంతరం సమీక్షించు కోవాలి. గంటలకొద్దీ పుస్తకాలతో కుస్తీ పట్టడం కాదు.. ఎంత వరకు అర్థమైందనేది ప్రధానం. ఇష్టంగా అర్థం చేసుకుంటూ చదవాలి. పరీక్షకు హాజరయ్యే లోపు కనీసం రెండుసార్లయినా రివిజన్ చేస్తేనే çపట్టు వస్తుంది. ఒకేసారి సిద్ధం కావాలి గ్రూప్స్ అభ్యర్థులకు ప్రిలిమ్స్ తర్వాత మెయి న్స్ పరీక్షకు లభించే కాల వ్యవధి సరిపోదు. దీంతో ప్రిలిమ్స్‌తో పాటు మెయిన్‌కు ఒకేసారి సిద్ధం కావడం ప్రారంభించాలి. లాంగ్ ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. రైటింగ్ స్కిల్స్ పెంచుకోవాలి. పాత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే పరీక్ష విధానం అర్థమవుతుంది. జవాబు ఎంత వరకు రాయాలో తెలుస్తుంది. ప్రతి దానిని సూక్ష్మంగా గమనించి దానికి అనుగుణంగా సిద్ధమయ్యేందుకు ప్రయత్నించాలి. ఆప్షనల్ సబ్జెక్టులు కీలకం గ్రూప్ మెయిన్స్ కోసం ఆప్షన్లు నిర్ణయించు కోవడం కీలకం. ఆసక్తిని బట్టి ఆప్షన్లు నిర్ణయిం చుకోవాలి. సంబంధిత సబ్జెక్టుల్లో గట్టి పట్టు సాధించేందుకు ప్రయత్నించాలి. అప్పుడే పరీక్ష సునాయాసంగా రాసేందుకు వీలుంటుంది. మెయిన్స్ ఇంటర్వ్యూలో సైతం ఆప్షన్స్‌పై అధిక ప్రశ్నలు అడుగుతారు.. అవసరం లేని సమాచారం వద్దు రెండు దశాబ్దాల క్రితం వరకు పోటీ పరీక్షలకు సమాచారం సేకరణ కష్టంగా ఉండేది. ప్రస్తుతం గూగుల్ సమాచార గనిగా మారింది. అనవసరమైన సమాచారం సేకరించకుండా సిలబస్‌కు అనుగుణంగా సమాచారం మాత్రమే సేకరించి వాటిపై దృష్టి సారించాలి. సమాధానాలతో సంతృప్తి పర్చాలి ఇంటర్వ్యూల్లో బోర్డు సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానాలతో సంతృప్తి పర్చగలగాలి. బోర్డు సభ్యుల దగ్గర అభ్యర్థి పూర్తి వివరాలు ఉంటాయి కాబట్టి ఒక్కొక్కరు ఒక్కో ప్రశ్న వేస్తారు. అందులో వ్యక్తిగత, నేటివిటీ, రాష్ట్రీయ, జాతీయ, సున్నితమైన, ఉద్యోగం సంబంధించి తదితర ప్రశ్నాలు సంధిస్తారు. వాటికి ఎలాంటి టెన్షన్ లేకుండా సునా యసంగా జవాబు ఇవ్వాలి. తెలియకుంటే తెలియదని స్పష్టంగా చెప్పాలి. తెలియకున్నా.. చెప్పడానికి ప్రయత్నించవద్దు. సమయపాలన ప్రధానం పోటీ పరీక్షల్లో సమయ పాలన కూడా ప్రధానం. సమయం వృథా చేయకుండా సంబంధిత సబ్టెక్టులపై పట్టు సాధించేందుకు ప్రయత్నించాలి. ఒక ప్రణాళిక రూపొందించుకొని ముందుకు సాగాలి. పరీక్ష రాసేటప్పుడు కూడా ముందుగానే ప్రశ్నలకు సమయం కేటాయించుకొని పూర్తి చేసే విధంగా ప్రయత్నించాలి. -
బైక్‌పై వెళ్లి.. ఆకస్మిక తనిఖీలు చేపట్టిన హైదరాబాద్ కలెక్టర్
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్య హైదరాబాద్‌లో భాగంగా కరోనా మహమ్మారి కట్టడి కోసం వంద శాతం లక్ష్యంగా కొనసాగుతున్న కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంపై హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆదివారం సికింద్రాబాద్ రసూల్‌పురాలోని గన్‌బజార్ కమ్యూనిటీ హాల్లో నిర్వహిస్తున్న వాక్సి నేషన్ సెంటర్‌ను ఆయన సందర్శించారు. కారు వెళ్లలేని కాలనీలకు కలెక్టర్ బైక్‌పై వెళ్లారు. ఓ వ్యక్తి బైక్ నడుపుతుండగా ఆయన వెనక కూర్చుని తనిఖీలకు దిగారు. ఇంటికి స్టిక్కర్ అంటించారా? లేదా? అని పరిశీలించారు. అధికారులు వచ్చి వాక్సినేషన్ గురించి వివరించి వివరాలు సేకరించారా? లేదా? అని స్థానికులను ఆరా తీశారు. ఆయన వెంట డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటి తదితరులు ఉన్నారు. చదవండి: కత్తులు పట్టుకొని బాలీవుడ్ డైలాగులు.. వాట్సాప్ స్టేటస్లు -
ప్రతాపరుద్రుని కోటలో కలెక్టర్ శర్మన్
సాక్షి, నాగర్ కర్నూల్: జిల్లాలోని అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామ శివారులోని నల్లమలలో ఉన్న ప్రతాప రుద్రుని కోటను జిల్లా కలెక్టర్ శర్మన్ సందర్శించారు. అటవీ శాఖా, పర్యాటక శాఖాధికారులతో కలిసి ఆదివారం ఉదయం ఆయన చారిత్రాత్మకమైన ప్రతాప రుద్రుని కోటను పరిశీలించారు. కొండలపై ఉన్న కోటను ఆయన కాలినడకన వెళ్లారు. పర్యాటకంగా కోటను అభివృద్ది చేసేందుకు గల చర్యలపై అధికారులతో కలెక్టర్ శర్మన్ చర్చించారు. (తెలంగాణలో కొత్తగా 2,924 కేసులు, 10 మరణాలు) శ్రీశైలం వెళ్లే పర్యాటకులు కోటపై నుంచి నల్లమల అందాలను వీక్షించే ఏర్పాట్ల చేస్తే పర్యాటకులు మధురానుభూతి పొందుతారని తెలిపారు. అందుకు కావాల్సిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. ప్రతాప రుద్రుని కోటపై ఏడు రకాల జలపాతాలు, పుష్కరిణులు ఉన్నాయి. వాటిని అభివృద్ది చేసి పర్యాటకులకు చేరువ చేస్తే బాగుంటుందని స్థానికులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. కాగా కొత్తగా కలెక్టర్ బాధ్యతలు చేపట్టిన శర్మన్ ప్రతాప రుద్రుని కోటను సందర్శంచడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
ఫార్మా కంపెనీ మాకొద్దు
ఆమనగల్లు: మండలంలోని ఎక్వాయిపల్లి గ్రామ సమీపంలో బల్క్‌డ్రగ్ పరిశ్రమ ఏ ర్పాటుపై గురువారం జిల్లా జాయింట్ కలెక్టర్ శర్మణ్ సమక్షంలో జరిపిన ప్రజాభిప్రాయ సేకరణలో స్థానికుల నుంచి ని రసన వ్యక్తమైంది. గ్రామ సమీపంలో సర్వేనం.233-1లోని ఐదెకరాల పొలం లో కెమ్క్యూబ్ ఫార్మా ప్రైవేట్ లిమిటడ్, బల్క్‌డ్రగ్ పరిశ్రమ ఏర్పాటుకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి దరఖా స్తు చేసుకున్నారు. దీనిపై కాలుష్య ని యంత్రణ మండలి ఆధ్వర్యంలో గురువారం పరిశ్రమ ఏర్పాటు స్థలం వద్ద జేసీ శర్మణ్, తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ అధికారి ఎం. దయానంద్, తహశీల్దార్ శ్రీను ఆధ్వర్యం లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిం చారు. అయితే ఎక్వాయిపల్లి, మర్రిపల్లి, కర్కల్‌పహాడ్, రాంనుంతల గ్రామాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పరిశ్రమ ఏర్పాటు చేయొద్ద ని జేసీ శర్మణ్‌కు వినతిపత్రం అందజేశా రు. ‘జేసీ శర్మణ్ గోబ్యాక్, ఫార్మా కంపెనీ మాకొద్దూ..’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. ప రిశ్రమ ఏర్పాటుపై ప్రజలు తమ అభిప్రాయాలు తెలిపితే అవే అభిప్రాయాలతో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందిస్తామ ని చెప్పారు. ప్రజలు తమ అభిప్రాయాలను నిర్భయంగా చెప్పాలని కోరారు. మాజీ ఎంపీపీ బుగ్గయ్యగౌడ్, మాజీ వైస్ ఎంపీపీ జోగు వీరయ్య, సర్పంచ్‌లు వెంక టయ్య, రాములు, ఎంపీటీసీ సభ్యుడు వీరయ్య, యాదయ్య, నర్సింహా, సాయి లు, నారమ్మ తదితరులు పరిశ్రమ ఏర్పా టు చేయవద్దని కోరారు. ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుండగానే పలువురు యువకులు తీవ్ర నిరసన తెలపడంతో జే సీ వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఆమనగల్లు సీఐ వేణుగోపాల్‌రెడ్డి, కల్వకుర్తి సీ ఐ వెంకట్, ఎస్ఐలు సాయికుమార్, చం ద్రమౌళి, శ్రీనివాస్, మక్దూమ్ అలీ, శ్రీని వాస్‌రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేశారు. -
సంప్రదాయ సేద్యానికి బాటలు వేయూలి
కల్వకుర్తి : సంప్రదాయ వ్యవసాయానికి పెద్ద పీట వేస్తూ, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలపై రైతులు ఆసక్తి చూపినప్పుడే వ్యవసాయం లాభసాటిగా మారుతుందని జారుుంట్ కలెక్టర్ శర్మన్ అన్నారు. లోక్ నాయక్ జయప్రకాశ్‌నారాయణ రైతు సేవా సంఘం ఆధ్వర్యంలో స్థానిక కన్యకా పరమేశ్వరీ ఆలయఆవరణంలో బుధవారం మాజీ సర్పంచ్ అల్వాల్‌రెడ్డి అధ్యక్షతన రైతు సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ తానూ రైతు బిడ్డనేనని, రైతు సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. శాస్త్రవేత్తలు నూతన వంగడాలను సృష్టిస్తున్నా, అవి రైతులకు చేరడం లేదన్నారు. రైతు కన్నీరు పెట్టడం దేశానికి మ ంచిది కాదని, రైతుల అభ్యున్నతికి ప్రతి ఒక్క రూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. తాను కొంతకాలం పాటు వ్యవసాయ ప్రతికను నిర్వహించానని, ప్రతి అం శంపై రైతులు దీర్ఘ దృష్టితో ముందుకు సాగుతూ వ్యవసాయంలో లాభాలు ఆర్జించాలన్నారు. రసాయనిక ఎరువుల వాడకంతోనే అధిక దిగుబడులు వస్తాయనే భ్రమనుంచి రైతులు బయట పడాల్సిన అవసరం ఉందన్నారు. స్వామినాథన్ సిఫారసులు అమలు చేయాలి... ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సిఫారసులను వెంటనే అమలు చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి అన్నారు. లోక్ నాయక్ జయప్రకాశ్నారాయణ్నుఆదర్శంగా తీసుకుని రైతులకు అండగా ఉండేందుకు వ్యవసాయంపై వారికి పూర్తి అవగాహన కల్పించేందుకు రైతు సదస్సు నిర్వహించనట్లు తెలిపారు. తరతరాలుగా భూమని నమ్ముకొని జీవిస్తున్న రైతులకు మేలు జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల అభ్యున్నతి కోసం ప్రణాళికలు రూపొందించాలని ఆయన కోరారు. విత్తనాలు, ఎరువుల ధరల నియంత్రణలో ప్రభుత్వాలు విఫలమయ్యూయని, పడించిన పంటకు గిట్టుబాటు ధర రాక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత యూపీఏ పాలనలో 2, 16, 800 మంది రైతులు ఆత్మ హత్యలు చేసుకున్నారని, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 47 మంది బలవన్మరణాలకు పాల్పడినట్లు తెలిపారు. నూతన వంగడాలను సాగు చేయాలి... అనంతరం వ్యవసాయ శాస్త్రవేత్తలు పంటల సాగుపై రైతులకు పలు సూచనలు చేశారు. వరి సాగులో డ్రమ్ సీడర్‌ను వినియోగించాలని, ఉద్యాన వన, పండ్ల తోటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. పాడి, కోళ్ల పరిశ్రమలతో ప్రత్యామ్నాయ ఆదాయూన్ని పొందవచ్చునన్నారు. పండ్లతోటల సాగుకు ప్రభుత్వం ఇస్తున్న రారుుతీలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి, సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలన్నారు. -
అదిరిపోయేలా పండుగ
జెడ్పీసెంటర్, న్యూస్‌లైన్: ఆరు దశాబ్దాల ప్రజల కల అయిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పండుగను ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అధికారులను ఆదేశించారు. జూన్ 2 తెలంగాణ ఆవిర్భవ వేడుకల ఏర్పాట్లను ఆదివారం ఆయన పర్యవేక్షించారు. జిల్లా పరిషత్‌లో ప్రభుత్వం తరపున అధికారికంగా నిర్వహించే ఆవిర్భవ వారోత్సవాల ఏర్పాట్లను ఆయన జిల్లా ఇన్చార్జి కలెక్టర శర్మన్‌తో కలిసి పర్యవేక్షించారు. ఎక్కడ ఏ లోటు లేకుండా అన్ని ఏర్పట్లను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం గడియారం చౌరస్తాలో ఉన్న అమరవీరుల స్తూపం పరిసరాలను పరిశీలించారు. అమరవీరుల స్థూపం పరిసరాలను శుభ్రంగా ఉంచాలని మున్సిపల్ కమిషనర్ అమరయ్యను ఆదేశించారు. ఆవిర్భవ సందర్భంగా ఆదివారం రాత్రి నిర్వహించే వేడుకలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను చేపట్టాని సూచించారు. ఆదివారం రాత్రి 10 గంటల నుంచే జిల్లా కేంద్రంలోని వివిధ చౌరస్తాల్లో కార్యక్రమాలు చేపడుతున్నట్లు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారికి తాగునీటి సదుపాయంతోపాటు అన్ని ఏర్పాట్లు చే యూలన్నారు. అదివారం అర్ధరాత్రి నుం చే సంబరాలు ప్రారంభమవుతాయని, అంతకు ముందు నుంచి బాణాసంచా పే ల్చే కార్యక్రమాలు చేపట్టడంతోపాటు సాంస్కృతిక కార్యక్రమలు చేపట్టనున్న ట్లు తెలిపారు. ప్రతి తెలంగాణ బిడ్డా వే డుకల్లోపాల్గొనాలని ఆయన కో రారు. తె లంగాణ సంబరాలను అధికారికంగా వా రం పాటు నిర్వహిస్తున్నట్లు చె ప్పారు. కా ర్యక్రమాల్లో టీఆర్ఎస్ నాయకులు రాజేశ్వర్‌గౌడ్, సుధాకర్‌రెడ్డి, కృష్ణముదిరాజ్, శ్రీకాంత్‌గౌడ్, సురేష్, శివకుమార్, ఆ నంద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఆఫీసులపై జాతీయ జెండా
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం సందర్భంగా సోమవారం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శర్మన్ అధికారులను ఆదేశిం చారు. ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. వేడుకల నిర్వాహణలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని శర్మన్ అధికారులకు సూచించారు. ప్రతి కార్యాలయాన్ని విద్యుద్దీపాలతో అలకరించి, పండుగవాతావరణాన్ని నెలకొల్పేలా ఏర్పాట్లు ఉండాలన్నారు. ఉదయం 8.30గంటల కల్లా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించా లన్నారు. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ప్రజలందరికి తెలిసేలా ఘనంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అమరయ్య, నేతలు శివకుమార్, రాజేశ్వర్ గౌడ్, బురుజు సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వలసకూలీలకు చెక్కులు పంపిణీ కర్ణాటక వలసకూలీలకు సంబంధించి రూ.13.79లక్షల చెక్కులను ఇన్చార్జి కలెక్టర్ శర్మన్ ఆదివారం తన చాంబర్లో అందజేశారు. వీరంతా కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారే అయినా, ప్రస్తుతం కొత్తకోటలో నివాసం ఉంటూ చిత్తూర్ జిల్లాలో ట్రాన్స్ట్రాయ్ కంపెనీలో రోడ్డు పనులు చేయించుకొన్న తరువాత కంపెనీ వారికి వేతనాలు ఇవ్వలేదు. అయితే వీరు యూనియన్ ద్వారా హైకోర్టును ఆశ్రయించగా కోర్టు కూలీల పక్షాన తీర్పునిస్తూ 32మంది కూలీలకు నూ.27లక్షలు చెల్లించాలని కంపెనీని ఆదేశించింది. దీంతో వెంటనే కూలీలకు చెల్లించాల్సిన డబ్బులను యూజమాన్యం జిల్లా అధికారులకు అందజేయగా, ఆ చెక్కులను బాధితులకు అందజేశారు. అమరుల త్యాగాల ఫలితం జెడ్పీసెంటర్: అమర వీరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమై ందని ఇన్చార్జి కలెక్టర్ ఎల్.శర్మన్ అన్నారు. ఆదివారం జిల్లా పరిషత్ ఆవరణలో ఏర్పాటు చే సిన తె లంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ డిమాండ్ అనేది ఆరు శతాబ్దాల స్వప్నం సాకారమైందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కోసం తొలిదశ, మలిదశ ఉద్యమాల్లో విద్యార్థులు కీలక పాత్ర పోషించారని, వారి అనితరమైన త్యాగాలు చేశారని కొనియూడారు. నూతన రాష్ట్రం అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల ని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీ ఆర్వో రాంకిషన్, డీఆర్డీఏ పీడీ చంద్ర శేఖర్‌రెడ్డి, ఆర్డీఓ హనుమం తురావు, హరిత,గీత, అదికారులు ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.