అదిరిపోయేలా పండుగ
జెడ్పీసెంటర్, న్యూస్‌లైన్: ఆరు దశాబ్దాల ప్రజల కల అయిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పండుగను ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అధికారులను ఆదేశించారు. జూన్ 2 తెలంగాణ ఆవిర్భవ వేడుకల ఏర్పాట్లను ఆదివారం ఆయన పర్యవేక్షించారు. జిల్లా పరిషత్‌లో ప్రభుత్వం తరపున అధికారికంగా నిర్వహించే ఆవిర్భవ వారోత్సవాల ఏర్పాట్లను ఆయన జిల్లా ఇన్‌చార్జి కలెక్టర శర్మన్‌తో కలిసి పర్యవేక్షించారు. ఎక్కడ ఏ లోటు లేకుండా అన్ని ఏర్పట్లను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం గడియారం చౌరస్తాలో ఉన్న అమరవీరుల స్తూపం పరిసరాలను పరిశీలించారు.
అమరవీరుల స్థూపం పరిసరాలను శుభ్రంగా ఉంచాలని మున్సిపల్ కమిషనర్ అమరయ్యను ఆదేశించారు. ఆవిర్భవ సందర్భంగా ఆదివారం రాత్రి నిర్వహించే వేడుకలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను చేపట్టాని సూచించారు. ఆదివారం రాత్రి 10 గంటల నుంచే జిల్లా కేంద్రంలోని వివిధ చౌరస్తాల్లో కార్యక్రమాలు చేపడుతున్నట్లు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారికి తాగునీటి సదుపాయంతోపాటు అన్ని ఏర్పాట్లు చే యూలన్నారు.
అదివారం అర్ధరాత్రి నుం చే సంబరాలు ప్రారంభమవుతాయని, అంతకు ముందు నుంచి బాణాసంచా పే ల్చే కార్యక్రమాలు చేపట్టడంతోపాటు సాంస్కృతిక కార్యక్రమలు చేపట్టనున్న ట్లు తెలిపారు. ప్రతి తెలంగాణ బిడ్డా వే డుకల్లోపాల్గొనాలని ఆయన కో రారు. తె లంగాణ సంబరాలను అధికారికంగా వా రం పాటు నిర్వహిస్తున్నట్లు చె ప్పారు. కా ర్యక్రమాల్లో టీఆర్‌ఎస్ నాయకులు రాజేశ్వర్‌గౌడ్, సుధాకర్‌రెడ్డి, కృష్ణముదిరాజ్, శ్రీకాంత్‌గౌడ్, సురేష్, శివకుమార్, ఆ నంద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.