రాయల తెలంగాణకు ప్రతిపాదనకు తెలంగాణ జేఏసీ వ్యతిరేకమని టీజీవో అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ : రాయల తెలంగాణకు ప్రతిపాదనకు తెలంగాణ జేఏసీ వ్యతిరేకమని టీజీవో అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. ఆయన మంగళవారమిక్కడ సాక్షి ప్రతినిధితో మాట్లాడుతూ 12 జిల్లాల తెలంగాణ తమకు ఆమోదం కాదన్నారు. కర్నూలు వదిలించుకునేందుకే కొందరు సీమాంధ్ర నేతలు ఈ ప్రతిపాదన చేస్తున్నారని శ్రీనివాస్ గౌడ్, దేవీప్రసాద్, విఠల్ వ్యాఖ్యానించారు.
తెలంగాణను అడ్డుకునేందుకే కుట్ర జరుగుతుందని వారు ఆరోపించారు. కేంద్ర కేబినెట్ ముందుకు రాయల తెలంగాణ బిల్లును వస్తే.. ఆ బిల్లు పార్లమెంట్‌లోకి రాకముందే తెలంగాణలో సకలజనుల సమ్మెను మించిన ఉద్యమాన్ని ఉద్యోగులు చేపడతారని హెచ్చరించారు.