ఆమనగల్లు: మండలంలోని ఎక్వాయిపల్లి గ్రామ సమీపంలో బల్క్‌డ్రగ్ పరిశ్రమ ఏ ర్పాటుపై గురువారం జిల్లా జాయింట్ కలెక్టర్ శర్మణ్ సమక్షంలో జరిపిన ప్రజాభిప్రాయ సేకరణలో స్థానికుల నుంచి ని రసన వ్యక్తమైంది. గ్రామ సమీపంలో సర్వేనం.233-1లోని ఐదెకరాల పొలం లో కెమ్‌క్యూబ్ ఫార్మా ప్రైవేట్ లిమిటడ్, బల్క్‌డ్రగ్ పరిశ్రమ ఏర్పాటుకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి దరఖా స్తు చేసుకున్నారు. దీనిపై కాలుష్య ని యంత్రణ మండలి ఆధ్వర్యంలో గురువారం పరిశ్రమ ఏర్పాటు స్థలం వద్ద జేసీ శర్మణ్, తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ అధికారి ఎం. దయానంద్, తహశీల్దార్ శ్రీను ఆధ్వర్యం లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిం చారు.
అయితే ఎక్వాయిపల్లి, మర్రిపల్లి, కర్కల్‌పహాడ్, రాంనుంతల గ్రామాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పరిశ్రమ ఏర్పాటు చేయొద్ద ని జేసీ శర్మణ్‌కు వినతిపత్రం అందజేశా రు. ‘జేసీ శర్మణ్ గోబ్యాక్, ఫార్మా కంపెనీ మాకొద్దూ..’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. ప రిశ్రమ ఏర్పాటుపై ప్రజలు తమ అభిప్రాయాలు తెలిపితే అవే అభిప్రాయాలతో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందిస్తామ ని చెప్పారు.
ప్రజలు తమ అభిప్రాయాలను నిర్భయంగా చెప్పాలని కోరారు. మాజీ ఎంపీపీ బుగ్గయ్యగౌడ్, మాజీ వైస్ ఎంపీపీ జోగు వీరయ్య, సర్పంచ్‌లు వెంక టయ్య, రాములు, ఎంపీటీసీ సభ్యుడు వీరయ్య, యాదయ్య, నర్సింహా, సాయి లు, నారమ్మ తదితరులు పరిశ్రమ ఏర్పా టు చేయవద్దని కోరారు. ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుండగానే పలువురు యువకులు తీవ్ర నిరసన తెలపడంతో జే సీ వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఆమనగల్లు సీఐ వేణుగోపాల్‌రెడ్డి, కల్వకుర్తి సీ ఐ వెంకట్, ఎస్‌ఐలు సాయికుమార్, చం ద్రమౌళి, శ్రీనివాస్, మక్దూమ్ అలీ, శ్రీని వాస్‌రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేశారు.
ఫార్మా కంపెనీ మాకొద్దు
Published Fri, Dec 5 2014 1:51 AM | Last Updated on Sat, Sep 2 2017 5:37 PM
Advertisement