ఎస్సీ వర్గీకరణ కోరుతూ డిసెంబర్ 17న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తామని ఎమ్మార్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు.
హైదరాబాద్ : ఎస్సీ వర్గీకరణ కోరుతూ డిసెంబర్ 17న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తామని ఎమ్మార్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. గురువారం హైదరాబాద్లో మందకృష్ణ మాదిగ విలేకర్లతో మాట్లాడుతూ... ఎస్సీ వర్గీకరణ పేరుతో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాల మాదిగలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించి న్యూఢిల్లీకి ప్రతినిధి బృందాన్ని తీసుకెళ్లాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.