నమ్మించి మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట | Chandra Babu excelled in believing fraud | Sakshi
Sakshi News home page

నమ్మించి మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట

Published Sun, Jun 21 2015 3:03 AM | Last Updated on Tue, Aug 14 2018 11:24 AM

Chandra Babu excelled in believing fraud

ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు

 నాయుడుపేట : నమ్మించి మోసం చేయడంలో ముఖ్యమంత్రి చందబ్రాబునాయుడు దిట్టని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు పేర్కొన్నారు. నాయుడుపేట ఆర్ అండ్ బీ అతిథి గృహంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాదిగలతో ఉద్యమాలు చేయించి రిజర్వేషన్‌ను అమలు చేస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. మాదిగ జనాలతో పాదయాత్ర చేయించుకుని ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన చంద్రబాబు అదే మాదిగలను దూరం చేశారన్నారు.

 ఈ విధంగా మాదిగలను మోసం చేయడాన్ని అన్ని వర్గాల వారు గమనిస్తూనే ఉన్నారని చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ నాయకులు నారాయణ, గోవిందువాసుమాదిగ, వెంకటేశ్వర్లు, కంటేపల్లి రాజేష్, రవి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement