
'చంద్రబాబు సభలను అడ్డుకుంటాం'
ఒంగోలు: ఆదివారం నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనలను అడ్డుకుంటామని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. అంతేకాకుండా మాదిగ రిజర్వేషన్ల వర్గీకరణ చేపట్టని ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా మార్చి 10 వ తేదీన అసెంబ్లీని ముట్టడిస్తామన్నారు.