
'బాబుకు ఉసురు తప్పకుండా తగులుతుంది'
గుంటూరు: ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ శుక్రవారం గుంటూరులో నిప్పులు చెరిగారు. చంద్రబాబు కష్టాల్లో ఉన్నప్పుడు ఎంఆర్‌పీఎస్ ఆదుకుందని ఆయన గుర్తు చేశారు. 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా ఉన్నారు.
అయితే ఆ అంశంపై ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. సమాధానం చెప్పాలని నిలదీశారు. మాదిగల ఉసురు చంద్రబాబుకు తప్పకుండా తగులుతుందని మందకృష్ణ మండిపడ్డారు.