ఇబ్రహీంపట్నం రూరల్ : రోలు ముందు పెట్టుకుని.. చెట్ల ఆకులు, వేర్లు దంచుతూ మందులు తయారు చేస్తున్న ఈయన నాటువైద్యుడు కాదు.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు. 1989, 1994లో రెండు పర్యాయాలు సీపీఎం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రజలకు నిస్వార్థంగా సేవలందించారు. ఆస్తిపాస్తులు కూడబెట్టుకోకుండా ప్రజలే ఆస్తిగా బతికారు. 250 గజాల ఇళ్లు, సాధారణ కారు తప్ప ఆయనకు ఆస్తులు ఏమీ లేవు. మధుమేహం (డయాబెటిస్) బాధితుడు కావడంతో ఆయన స్వయంగా చెట్ల మందులు తయారు చేసుకుంటారు. ప్రభుత్వం నుంచి పెన్షనే జీవనాధారం. ఆయనకు ఇద్దరు కుమారులు. వారు ప్రైవేట్‌గా చిన్నచిన్న పనులు చేసుకుంటున్నారు. రాములు నిరాడంబర జీవితం నేటి తరం నేతలకు ఆదర్శప్రాయమే అని పలువురు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment