మహాత్మాగాంధీ విగ్రహాన్ని టీడీపీ ప్రభుత్వం కుట్ర ప్రకారం తొలగించిందని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు.
విజయవాడ : మహాత్మాగాంధీ విగ్రహాన్ని టీడీపీ ప్రభుత్వం కుట్ర ప్రకారం తొలగించిందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వ విధానాలకు నిరసనగా క్విట్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
సోమవారం కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని తొలగించిన ప్రదేశాన్ని పెద్దిరెడ్డితోపాటు బొత్స సత్యనారాయణ, కొలుసు పార్థసారథి, జోగి రమేష్ తదితర నేతలు పరిశీలించారు. కొత్తగా ప్రతిష్టించిన మహాత్మ గాంధీజి విగ్రహానికి నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు.