కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని తొలగించిన ప్రదేశాన్ని వైఎస్ఆర్ సీపీ నేతలు పరిశీలించారు.
విజయవాడ: కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని తొలగించిన ప్రదేశాన్ని వైఎస్ఆర్ సీపీ నేతలు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్థసారథి, జోగి రమేష్ పరిశీలించారు. గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్షమాపణలు చెప్పాలని వైఎస్ఆర్ సీపీ నేతలు డిమాండ్ చేశారు.
వందల కోట్ల రూపాయలతో చేస్తున్న కృష్ణా పుష్కర పనుల్లో నాణ్యతలేదని బొత్స విమర్శించారు. ఎక్కడ చూసినా పుష్కర పనులు నాసిరకంగానే కొనసాగుతున్నాయని ఆరోపించారు. టీడీపీ నేతల జేబులు నింపేందుకు పుష్కర పనులు అప్పగించారని అన్నారు. క్విట్ చంద్రబాబు-సేవ్ ఏపీ అని ప్రతి ఒక్కరూ నినదించాలని బొత్స చెప్పారు.