మూడడుగులకు.. మూడు కిలోమీటర్లు
ఇబ్రహీంపట్నం (గాంధీనగర్) :
పుష్కరఘాట్‌లు ఏర్పాటు చేసిన నదీపరివాహక గ్రామాల్లో స్థానికుల ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. పోలీసుల ఆంక్షలతో ప్రధాన ఘాట్‌లు ఉన్న చోట స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇబ్రహీంపట్నం, ఫెర్రి గ్రామాల వాసుల పరిస్థితి దారుణంగా ఉంది. ఏ చిన్న అవసరానికైనా బయటకు రావాలంటే కిలోమీటర్ల మేర తిరిగి రావాల్సివస్తోంది. ఇబ్రహీంపట్నం రింగు వద్ద ఫెర్రిరోడ్డులో ఉన్న వ్యక్తి కొండపల్లి వెళ్లే రోడ్డుకు రావాలంటే చుట్టూ మూడుకిలోమీటర్లు తిరిగి రావాల్సివస్తోంది. విజయవాడ వైపునుంచి వచ్చేవారు జాతీయరహదారిపై రెండు కిలోమీటర్లు వెళ్లి తిరిగి పలగాని హోటల్ పక్కగా వెనక్కు ఫెర్రి రోడ్డుకు రావాల్సిన పరిస్థితి. పనుల మీద ఒకటికి రెండు సార్లు బయటకు వెళ్లాలంటే పరిస్థితి ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. నిత్యావసరాల కోసం, పాలు, కూరగాయల కోసం బయటకు రావాల్సి వస్తోంది. ఆంక్షలు విధించకుండా బైక్‌లు అనుమతించాలని కొం దరు యువకులు బందోబస్తులో ఉన్న పోలీసు అధికారులతో వాగ్వాదానికి ది గారు. ఉన్నతాధికారులతో చర్చించి తక్షణమే నిర్ణయం తీసుకోవాలని కోరా రు. అందుకు పోలీసులు నిరాకరించా రు. తమకు ఉన్న ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఆంక్షలు వి«ధించామని మధ్య లో మార్పులు చేర్పులు కుదరవని తేల్చిచెప్పారు. స్థానిక నివాస ధ్రువపత్రం, ఆధార్ కార్డు చూపిన వారిని అనుమతిస్తామని చెప్పిన అధికారులు తీరా పుష్కరాలు ప్రారంభమయ్యాక అస్సలు అనుమతించకుండా ఇబ్బందు లు పెడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ససేమిరా అనడంతో పన్నెండు రోజులపా టు తమకు తిప్పలు తప్పవనుకుంటూ స్థానికులు ఉసూరుమన్నారు.
పోలీసు ఆంక్షలతో నరకం
ఇబ్రహీంపట్నం: పుష్కరాలకు విచ్చేసే భక్తులకు పోలీసులు తీరు తలనొప్పిగా మారింది. వృద్ధులు, వికలాంగులు అనే తేడాలేకుండా రూల్స్ పేరుతో నరకం చూపుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. విజయవాడకు చెందిన ధనుంజయవర్మ అనే పక్షవాతంతో బాధపడుతున్నా పుణ్యస్నానాల కోసం వచ్చారు. పోలీసులు నిబంధనల పేరుతో వారిని ఇబ్రహీంపట్నం సంగమం ఘాట్‌కు మళ్లించారు. చేసేదిలేక ఎంతో ప్రయాసతో ఇక్కడకు చేరుకున్నారు. రూల్స్ అంటూ పోలీసులు చుక్కలు చూపిస్తున్నారని ఆయన ఆవేదన చెందాడు. ఈ ఆలస్యం వల్ల ఆస్పత్రి అపాయింట్‌మెంట్ కోల్పోయినట్లు ఆవేదన చెందారు.