ఎస్సారెస్పీ భూముల పరిశీలన
Published Thu, Aug 4 2016 5:32 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM
ఇబ్రహీంపట్నం : మండల కేంద్రం శివారులో కాకతీయ కాలువకు ఇరువైపులా ఉన్న ఎస్సారెస్పీకి చెందిన భూములను గురువారం అధికారులు పరిశీలించారు. హరితహరంలో మొక్కలు నాటేందుకు అణువుగా ఉందోలేదో పరిశీలన జరిపారు. కాకతీయ కాలువనుంచి ఇరువైపులా 180 మీటర్ల వరకు ప్రభుత్వ స్థలమేనని కొందరు రైతులు కబ్జా చేసి పంటలను పండించుకున్నట్లు ఏఈ శ్రీనివాస్ తెలిపారు. త్వరలో స్వాధీనం చేసుకుంటామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ సురేశ్, ఎంపీడీవో శశికుమార్, వైస్ ఎంపీపీ గూడ పాపన్న, సర్పంచ్ నేమూరి లత, కార్యదర్శి రాజేందర్‌రావు, లస్కర్‌లు లక్ష్మీనారాయణ, లక్ష్మణ్, నాయకులు నేమూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement