దేశవ్యాప్తంగా హై అలర్ట్ కొనసాగుతున్న తరుణంలో హైదరాబాద్ శివారులో పేలుడు కలకలం సృష్టించింది. నగర శివారులోని ఇబ్రహీంపట్నంలో శనివారం రాత్రి 7గంటల తర్వాత..
హైదరాబాద్: ఉడీ ఉగ్రదాడి, పీవోకేఈలో భారత్ సర్జికల్ దాడుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా హై అలర్ట్ కొనసాగుతున్న తరుణంలో హైదరాబాద్ శివారులో పేలుడు కలకలం సృష్టించింది. నగర శివారులోని ఇబ్రహీంపట్నంలో శనివారం రాత్రి 7గంటల తర్వాత ఓ స్కూటర్ డిక్కీ పేలిపోవడంతో పెద్ద శబ్ధం వినిపించింది. దీంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపాటుకుగురయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు.
గతంలో నగరాన్ని కుదిపేసిన 'దిల్ సుఖ్ నగర్' పేలుళ్ల సమయంలో ఉగ్రవాదులు స్కూటర్ల ద్వారా బాంబులను తరలించిన నేపథ్యంలో నేటి ఘటనలోనూ ఉగ్రవాదుల హస్తం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ స్కూటర్ ఎవరిది? పేలిన పదార్థం ఏది? పేలుడు ఎలా సంభవించింది అనే విషయాలు తెలియాల్సిఉంది.