
చెరువులో మునిగి యువకుడు..
అనిల్‌కుమార్(25) సోమవారం యామాపూర్ శివారులోని వెంకటాద్రి చెరువులో ప్రమాదవశాత్తు పడి మృతిచెందాడు.
ఇబ్రహీంపట్నం(కోరుట్ల): మండలంలోని కేశాపూర్ గ్రామానికి చెందిన ముండల అనిల్‌కుమార్(25) సోమవారం యామాపూర్ శివారులోని వెంకటాద్రి చెరువులో ప్రమాదవశాత్తు పడి మృతిచెందాడు. బంధువులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ముండల అనిల్‌కుమార్ స్నేహితులతో కలిసి వ్యవసాయ భూముల వద్దకు వెళ్లాడు. పక్కనే ఉన్న చెరువులో నాటు పడవ ఉండడంతో పడవలో సరదాగా తిరిగేందుకు వెళ్లాడు ప్రమాదవశాత్తు పడవ మునగడంతోపాటు ఇతను నీటిలో మునిగిపోయాడు.
గమనించిన ఓ మత్స్యకారుడు కాపాడేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. స్నేహితులు కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి చెరువులో నుంచి మృతదేహాన్ని బయటకు తీయించారు. అనిల్‌కుమార్ రెండేళ్ల క్రితం వరకు ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. ప్రస్తుతం వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మృతుడికి భార్య, 4 నెలల కొడుకు ఉన్నాడు. తల్లి మల్లవ్వ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు.