దిగ్విజయ్ నేతృత్వంలో టి.కాంగ్రెస్ సదస్సు!
రంగారెడ్డి: గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి, పార్టీ పటిష్టత తదితర అంశాలపై చర్చేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రెండు రోజులపాటు సదస్సు నిర్వహిస్తోంది. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీపట్నంలో జరిగే సమావేశానికి కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తోపాటు పార్టీ పెద్దలు హాజరుకానున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశం సోమవారం ముగుస్తుంది.
ఈ సదస్సుకు అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి నేతలు హాజరుకానున్నారు. 10 అంశాలపై గ్రూపులుగా విడిపోయి నేతలు చర్చించనున్నట్టు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తెలిపారు.