తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలు కాంగ్రెస్ అదిష్టానం పిలుపు మేరకు సోమవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలు కాంగ్రెస్ అదిష్టానం పిలుపు మేరకు సోమవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఏఐసీసీ ప్రధానకార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ సమక్షంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, శాసనసభ ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, మాజీ మంత్రి దానం నాగేందర్, కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సునీతా లక్ష్మారెడ్డి సమావేశం కానున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై ఈ రోజు సాయంత్రం 6 గంటలకు అనుసరించాల్సిన వ్యూహంపై కసరత్తు చేయనున్నట్టు సమాచారం.