హస్తిన బాట పట్టిన టీ కాంగ్రెస్ నాయకులు
హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ చర్యలు చేపట్టింది. అందులోభాగంగా బుధవారం తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్తో ఆ రాష్ట్రానికి చెందిన సీనియర్ నేత జానారెడ్డి, పలువురు సీనియర్లతోపాటు ఖమ్మం జిల్లా నేతలు భేటీ కానున్నారు. అందుకోసం ఈ రోజు ఉదయమే వారంతా హస్తినకు పయనమైయ్యారు. కాగా ఇప్పటికే టీపీసీసీ చీఫ్ పొన్నాల, డీఎస్ న్యూఢిల్లీ చేరుకున్నారు.
ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరికి, జిల్లాకు చెందిన పలువురు సీనియర్ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. దీంతో అదికాక గత ఆరునెలలుగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. దీంతో డీసీసీ అధ్యక్ష నియమకంతో పాటు ఇతర అంశాలపై చర్చకు వచ్చే అవకాశం ఉంది.