తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేశారు. సోమవారం తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాష్ట్రపతి ప్రణబ్ను కలిశారు. అనంతరం నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. క్యాంప్ ఆఫీసు, తెలంగాణ సచివాలయంలో ఇతర పార్టీ నేతలకు టీఆర్ఎస్ కండువా కప్పుతున్నారంటూ విమర్శించారు.
ఇది అప్రజాస్వామికంగా ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహిరిస్తున్న తీరుపై చర్యలు తీసుకోవాలని ప్రణబ్ను కోరినట్టు ఎంపీ గుత్తా తెలిపారు.