హైదరాబాద్: వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ఆరోపిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్కు ఫిర్యాదు చేశారు. వరంగల్లో ప్రభుత్వం, మంత్రులు విధాన ప్రకటనలతో ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తోందని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు.
టీఆర్ఎస్కు ఓటు వేయకపోతే కళ్లు పోతాయని.. మంత్రి కేటీఆర్ ఓటర్లను భయపెడుతున్నారని అన్నారు. పోలీస్ రిక్రూట్మెంట్ ప్రకటన, మహిళలకు రిజర్వేషన్లు ఇస్తామని నిరుద్యోగులను ప్రలోభ పెడుతున్నారని తెలిపారు. ఓడిపోతామన్న భయంతోనే కేసీఆర్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని గుత్తా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నిక ఏకపక్షం, గెలుపు తమదే అంటున్న మంత్రులు వరంగల్లో ఎందుకు ప్రచారం చేస్తున్నారని అడిగారు. గెలుపుపై అంత ధీమా ఉంటే మంత్రులు ప్రచారం వదిలి హైదరాబాద్ రావాలని సూచించారు. ఎన్నికల ప్రచారం చేయకుండా కాంగ్రెస్ నేతలపై కేసులు పెట్టి భయపెడుతున్నారని గుత్తా ధ్వజమెత్తారు.