banvar lal
-
పంజాబ్ సీఎంకు బిగ్ రిలీఫ్.. అందుకు గవర్నర్ ఓకే!
చండీగఢ్: అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి బల నిరూపణ చేసుకోవాలని భావిస్తున్న పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్కు ఊరట లభించింది. అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి చివరి క్షణంలో నిరాకరించి ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్ ఇచ్చిన గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్.. ఎట్టకేలకు ఓకే చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు ఆప్ ఎమ్మెల్యే, అసెంబ్లీ స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వాన్. ‘మా వినతికి గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈనెల 27న మంగళవారం అసెంబ్లీ మూడో సెషన్స్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.’అని పేర్కొన్నారు. అయితే.. ఈ ప్రత్యేక సమావేశాల్లో విశ్వాస పరీక్ష నిర్వహిస్తారా? లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియటం లేదని ఆప్ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు.. సెప్టెంబర్ 27న ప్రారంభం కానున్న ప్రత్యేక సమావేశాలను రాష్ట్రంలోని పంట వ్యర్థాల కాల్చివేత, విద్యుత్తు రంగం సమస్యలపై చర్చించేందుకు ఉపయోగించుకుంటామని ఆప్ ప్రభుత్వం చెబుతోంది. బీజేపీ ఆపరేషన్ లోటస్ పేరుతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోందన్న ఆరోపణల మధ్య తమ బల నిరూపణ చేసుకునేందుకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ఆప్ ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబర్ 22న విశ్వాస పరీక్ష నిర్వహిస్తామని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రకటించారు. అయితే.. చివరి క్షణంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు నిరాకరించి.. ఆప్‌కు షాక్ ఇచ్చారు గవర్నర్ బన్వారి లాల్ పురోహిత్. దీంతో గవర్నర్‌పై తీవ్ర విమర్శలు చేశారు ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని దుయ్యబట్టారు. ఇదీ చదవండి: పంజాబ్ సీఎంకు షాక్.. ప్రత్యేక అసెంబ్లీ సెషన్‌కు గవర్నర్ నో.. -
ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకలిస్తాం
సాక్షి, చెన్నై: కశ్మీర్లో ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకలిస్తామని హోం మంత్రి అమిత్ షా తెలిపారు. కశ్మీర్ అభివృద్ధి, సంక్షేమంపై ఇక పూర్తి స్థాయిలో కేంద్రం దృష్టి పెడుతుందని ఆయన చెప్పారు. ఉప రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడి రెండేళ్ల పయనంలో సాగిన పర్యటనలు, సందేశాలు, ఉపదేశాలు, కార్యక్రమాలతో కూడిన ‘లిజనింగ్ లెర్నింగ్ లీడింగ్’ పుస్తకావిష్కరణ ఆదివారం చెన్నైలో జరిగింది. సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ నేతృత్వంలో రూపొందించిన ఈ పుస్తకాన్ని అమిత్‌షా ఆవిష్కరించారు. తొలి ప్రతిని వెంకయ్య అందుకున్నారు. విద్యార్థి దశ నుంచి ఉపరాష్ట్రపతి స్థాయి వరకు వెంకయ్య చేసిన రాజకీయ, ప్రజాసేవ గురించి అమిత్ షా వివరించారు. ఆర్టికల్ 370 రద్దు అంశాన్ని ప్రస్తావిస్తూ కశ్మీర్లో ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించి వేస్తామని స్పష్టం చేశారు. వెంకయ్య ఇన్నాళ్ల తన పయనాన్ని గుర్తుచేసుకుంటూ రాజకీయంగా తప్పుకున్నా, ప్రజాసేవలో, ప్రజాపయనంలో విశ్రాంతి లేదని వ్యాఖ్యానించారు. కార్యక్రమానికి హాజరైన ప్రముఖ నటుడు రజనీకాంత్.. వెంకయ్యతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. గొప్ప ఆధ్యాత్మిక వాదిగా ఉన్న వెంకయ్య పొరపాటున రాజకీయాల్లోకి వచ్చేశారని చమత్కరించారు. కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్, సీఎం పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తదితరులు హాజరయ్యారు. అమిత్ షాకి రజినీ ప్రశంసలు కశ్మీర్ వ్యవహారం, ఆర్టికల్ 370 రద్దు విషయమై హోం మంత్రి అమిత్‌షాను రజినీకాంత్ అభినందించారు. ప్రధానమంత్రి మోదీ, అమిత్‌షా కృష్ణార్జునులని కొనియాడారు. ‘నరేంద్ర మోదీ, అమిత్ షా ద్వయం కృష్ణార్జునుల ద్వయం వంటిది. అయితే వీరిద్దరిలో కృష్ణుడు ఎవరో, అర్జునుడు ఎవరో మనకు తెలీదు’ అని రజినీకాంత్ అన్నారు. త్వరలో రాజకీయ పార్టీని స్థాపించి, 2021లో తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తానని రజినీకాంత్ గతంలో చెప్పడం తెలిసిందే. -
అక్రమాలు అడ్డుకున్నారని భన్వర్‌లాల్‌పై కక్ష
సాక్షి, విశాఖపట్నం: పదవీ విరమణ చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌పై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ ఐఏఎస్ అధికారి, భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ ఆరోపించారు. ఇటీవల కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికలో భన్వర్‌లాల్ తెలుగుదేశం ప్రభుత్వ ఆగడాలను నియంత్రించారని, అందువల్లే ఆయనపై సర్కారు కక్ష కట్టి వేధింపులకు పాల్పడుతోందని పేర్కొన్నారు. పదవీ విరమణ చేసిన రోజే ఆయనకు ప్రభుత్వం నోటీసులు జారీ చేయడంపై అభ్యంతరం తెలిపారు. ఈ మేరకు శర్మ.. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) ఏకే జ్యోతికి గురువారం లేఖ రాశారు. భన్వర్‌లాల్ వ్యవహారంలో సీఈసీ జోక్యం చేసుకోవాలని కోరారు. లేనిపక్షంలో భవిష్యత్తులో రాష్ట్రాల ఎన్నికల అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించలేరని, తద్వారా ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని ఆందోళన వ్యక్తం చేశారు. నంద్యాల ఎన్నికలో అధికార పార్టీ అభ్యర్థి ఎన్నికల కమిషన్ విధించిన పరిమితికి మించి వ్యయం చేశారని, దీనిపై కూడా ఎన్నికల కమిషన్ చట్టపరంగా వ్యవహరించాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ ఇలా ఎన్నికల అధికారుల విధుల్లో జోక్యం చేసుకోవడం, వారిపై వేధింపులకు దిగడం ఇదే తొలిసారి కాదన్నారు. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని సీఈసీని శర్మ కోరారు. -
'టీఆర్ఎస్ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తోంది'
-
'టీఆర్ఎస్ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తోంది'
హైదరాబాద్: వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ఆరోపిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్‌కు ఫిర్యాదు చేశారు. వరంగల్‌లో ప్రభుత్వం, మంత్రులు విధాన ప్రకటనలతో ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తోందని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్కు ఓటు వేయకపోతే కళ్లు పోతాయని.. మంత్రి కేటీఆర్ ఓటర్లను భయపెడుతున్నారని అన్నారు. పోలీస్ రిక్రూట్మెంట్ ప్రకటన, మహిళలకు రిజర్వేషన్లు ఇస్తామని నిరుద్యోగులను ప్రలోభ పెడుతున్నారని తెలిపారు. ఓడిపోతామన్న భయంతోనే కేసీఆర్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని గుత్తా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిక ఏకపక్షం, గెలుపు తమదే అంటున్న మంత్రులు వరంగల్‌లో ఎందుకు ప్రచారం చేస్తున్నారని అడిగారు. గెలుపుపై అంత ధీమా ఉంటే మంత్రులు ప్రచారం వదిలి హైదరాబాద్ రావాలని సూచించారు. ఎన్నికల ప్రచారం చేయకుండా కాంగ్రెస్ నేతలపై కేసులు పెట్టి భయపెడుతున్నారని గుత్తా ధ్వజమెత్తారు.