: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన టీడీపీ మరోసారి ప్రలోభాలకు పాల్పడుతోంది.
హైదరాబాద్ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన టీడీపీ మరోసారి ప్రలోభాలకు పాల్పడుతోంది. ఈసారి తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గాలం వేస్తోంది. క్రాస్ ఓటింగ్లో టీడీపీ అభ్యర్తికి ఓటు వేయాలని ఫోన్ చేశారని టీ.కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. మధ్యవర్తుల ద్వారా ఫోన్ చేయించి ఎంత డబ్బు కావాలో చెప్పాలంటూ మంతనాలు జరిపారని వారు పేర్కొన్నారు.
మరోవైపు ఉత్కంఠ వాతావరణం మధ్య తెలంగాణ శాసనమండలి ఎన్నికలు జరుగుతున్నాయి. ఆరు ఎమ్మెల్సీ సీట్లకు గాను బరిలో ఏడుగురు ఉన్న విషయం తెలిసిందే.